HYD – VJD : హైవే వాహనదారులకు గుడ్‌న్యూస్
HYD - VJD : గతంలో జీఎమ్మార్ సంస్థ నిర్వహణలో ఉండగా టోల్ చార్జీలు తరచుగా పెరిగేవి. ఇప్పుడు ఎన్‌హెచ్‌ఏఐ నిర్వహణలోకి వచ్చిన తరువాత టోల్ రుసుములు తగ్గించడంతో వాహనదారులకు ప్రయోజనం కలుగనుంది
- By Sudheer Published Date - 10:34 AM, Mon - 31 March 25

హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారి (Hyderabad – Vijayawada National Highway)పై ప్రయాణించే వాహనదారులకు ఊరట కలిగించే వార్త. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ఈ మార్గంలో టోల్ చార్జీలు(Toll Charges Reduced) తగ్గాయి . మార్చి 31 అర్ధరాత్రి నుండి కొత్త ధరలు అమల్లోకి రానున్నాయి. ముఖ్యంగా పంతంగి టోల్ ప్లాజా వద్ద కార్లకు రూ.15, బస్సులకు రూ.50 వరకు తగ్గించబడింది. చిల్లకల్లు టోల్ ప్లాజా వద్ద అన్ని వాహనాలకూ రూ.5 తగ్గింపు అందించబడింది. గతంలో ఈ రహదారిని నిర్వహించిన జీఎమ్మార్ సంస్థ ఏడాదికోసారి టోల్ ఛార్జీలను పెంచుతుండగా, ఇప్పుడు ఎన్‌హెచ్‌ఏఐ అధికారం చేపట్టిన అనంతరం టోల్ రుసుములను తగ్గించడం వాహనదారులకు పెద్ద ఊరటగా మారింది.
Sweating: చంకల్లో వచ్చే విపరీతమైన చెమట కారణంగా ఇబ్బంది పడుతున్నారా.. అయితే వెంటనే ఇలా చేయండి!
పంతంగి టోల్ ప్లాజా వద్ద కార్లు, జీపులు, వ్యాన్‌లకు ఒకవైపు ప్రయాణానికి రూ.15, రెండు వైపులా రూ.30 వరకు తగ్గించగా, తేలికపాటి వాణిజ్య వాహనాలకు ఒకవైపు రూ.25, రెండు వైపులా రూ.40 తగ్గించారు. బస్సులు, ట్రక్కులకు ఒకవైపు రూ.50, రెండు వైపులా రూ.75 వరకు తగ్గింపు వచ్చింది. ఇదే విధంగా చిల్లకల్లు టోల్ ప్లాజా వద్ద అన్ని వాహనాలకు ఒకవైపు రూ.5, రెండు వైపులా రూ.10 తగ్గించారు. అలాగే 24 గంటలలోపు తిరుగు ప్రయాణం చేసే వాహనదారులకు టోల్ రుసుములో 25% తగ్గింపు లభిస్తుంది. ఈ తగ్గింపు 2026 మార్చి 31 వరకు అమలులో ఉంటుందని అధికారులు తెలిపారు.
హైదరాబాద్- విజయవాడ హైవే రెండు తెలుగు రాష్ట్రాలను కలిపే అత్యంత రద్దీ మార్గాలలో ఒకటి. రోజూ వేల సంఖ్యలో వాహనదారులు ఈ రహదారిని ఉపయోగించుకుంటున్నారు. గతంలో జీఎమ్మార్ సంస్థ నిర్వహణలో ఉండగా టోల్ చార్జీలు తరచుగా పెరిగేవి. ఇప్పుడు ఎన్‌హెచ్‌ఏఐ నిర్వహణలోకి వచ్చిన తరువాత టోల్ రుసుములు తగ్గించడంతో వాహనదారులకు ప్రయోజనం కలుగనుంది. ఈ నిర్ణయం ప్రత్యేకంగా లారీ, బస్సు యజమానులకు, రోజువారీ ప్రయాణికులకు ఆర్థికంగా ఉపశమనం కలిగించనుంది. ప్రభుత్వ నిర్ణయంతో హైదరాబాద్-విజయవాడ మార్గంలో ప్రయాణించే వాహనదారులు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.