HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Huge Twist In Visakhapatnam Jessicas Death Case

Jessica : విశాఖ జెస్సికా మృతి కేసులో భారీ ట్విస్ట్‌

తన గురించి తప్పుడు ప్రచారం చేస్తోందన్న నెపంతో సాయికిరణ్ అనే స్నేహితుడు జెస్సికాని నిలదీశాడు. ఈ క్రమంలో సాయికిరణ్, లక్ష్మీ సౌజన్య, యశ్వంత్ కలిసి ఆమెపై భౌతిక దాడికి దిగారు

  • Author : Sudheer Date : 16-04-2026 - 5:30 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Jessica
Jessica

విశాఖకు చెందిన జెస్సికా మృతి కేసులో పోలీసులు జరిపిన విచారణలో కీలక విషయాలు వెల్లడయ్యాయి. ఈనెల 14న విశాలాక్షినగర్‌లోని ఒక లాడ్జిలో స్నేహితుడి బర్త్‌డే వేడుకల కోసం జెస్సికా తన మిత్ర బృందంతో కలిసి వెళ్లింది. అక్కడ పార్టీ జరుగుతున్న సమయంలో స్నేహితుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. తన గురించి తప్పుడు ప్రచారం చేస్తోందన్న నెపంతో సాయికిరణ్ అనే స్నేహితుడు జెస్సికాని నిలదీశాడు. ఈ క్రమంలో సాయికిరణ్, లక్ష్మీ సౌజన్య, యశ్వంత్ కలిసి ఆమెపై భౌతిక దాడికి దిగారు. స్నేహితులందరూ చూస్తుండగానే జరిగిన ఈ దాడితో జెస్సికా తీవ్ర మనస్థాపానికి గురైంది. దెబ్బల ధాటికి ఆమెకు ఫిట్స్ కూడా వచ్చినట్లు పోలీసులు గుర్తించారు.

ఆత్మహత్యగా మలుపు- హోటల్ గదిలో విషాదం

దాడి జరిగిన అనంతరం భయపడిన స్నేహితులు ఆమెకు నీళ్లు తాగిపి, ఆమె పేరు మీద బుక్ చేసిన 118 నంబర్ గదిలోకి పంపించారు. తన సన్నిహితులే తనపై దాడి చేయడాన్ని జీర్ణించుకోలేకపోయిన జెస్సికా, అదే గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కొంత సమయం తర్వాత స్నేహితులు వెళ్లి తలుపు తట్టినా స్పందన లేకపోవడంతో, తలుపులు పగులగొట్టి చూడగా ఆమె అపస్మారక స్థితిలో కనిపించింది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించినప్పటికీ, అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. తొలుత ఫిట్స్ రావడం వల్లే చనిపోయిందని స్నేహితులు నమ్మబలికనప్పటికీ, పోలీసుల విచారణలో అసలు నిజం బయటపడింది.

కుటుంబ సభ్యుల ఆరోపణలు – పోలీసుల దర్యాప్తు

జెస్సికా మృతిపై ఆమె కుటుంబ సభ్యులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇది ముందస్తు ప్లాన్ ప్రకారం జరిగిన హత్యేనని, ఆధారాలు దొరక్కుండా ఉండేందుకు హోటల్‌లోని సీసీ కెమెరాల దిశను కూడా మార్చారని వారు ఆరోపిస్తున్నారు. హోటల్ యాజమాన్యం సమాచారం ప్రకారం, జెస్సికానే తన గుర్తింపు కార్డు సమర్పించి గదిని బుక్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అరిలోవా పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు (Abetment to Suicide) కేసు నమోదు చేశామని, పూర్తి స్థాయి విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షిస్తామని సీఐ మల్లేశ్వరరావు తెలిపారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Clash at Birthday Party
  • Jessica Suicide Case Update
  • Vizag Jessica
  • Vizag Jessica Death Case
  • Vizag Shanti Kumari Death

Related News

    Latest News

    • Delhi Airport : ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో విమాన ప్రమాదం ..!!

    • TDP Working President : నారా లోకేష్ పదవి పై వర్మ కీలక వ్యాఖ్యలు

    • IPL 2026 MI Vs PBKS : డికాక్ సెంచరీ..PBKS కు 196 టార్గెట్

    • Instagram : ఇన్‌స్టాగ్రామ్ పరిచయం ఏకంగా ఇద్దరి బాలికలను ఇల్లు వదిలేలా చేసింది !!

    • Orchid Hotels : ఇండియా లో హిల్టన్ హోటళ్ల భారీ స్కెచ్

    Trending News

      • BJP MP Tejasvi Surya: ఏపీ విభజనపై ఎంపీ తేజస్వి సూర్య ఫైర్

      • అంపైర్ల పొరపాటు.. జరిమానా విధించాలని డిమాండ్!

      • ఆర్సీబీకి బ్యాడ్ న్యూస్‌.. నేటి మ్యాచ్‌కు కోహ్లీ దూరం?!

      • అమెరికాపై చైనా సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు?!

      • NARA LOKESH: పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా మంత్రి నారా లోకేష్

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd