Anna Canteen : చంద్రబాబు పిలుపుతో అన్న క్యాంటీన్లకు భారీగా విరాళాలు
రాష్ట్ర వ్యాప్తంగా పదుల సంఖ్యలో అన్న క్యాంటీన్లు పున:ప్రారంభించి పేదవాడి ఆకలి తీరుస్తున్నారు
- By Sudheer Published Date - 04:07 PM, Tue - 20 August 24

తక్కువ ధరకే భోజనం అందించే “ఎన్టీఆర్ అన్న క్యాంటిన్” (Anna Canteen) పథకాన్ని టీడీపీ ప్రభుత్వం పున:ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఆగస్టు 15 న గుడివాడ మునిసిపల్ పార్క్‌లో అన్న క్యాంటీన్‌ను సీఎం చంద్రబాబు (Chandrababu) దంపతులు ప్రారంభించారు. స్వయంగా ముఖ్యమంత్రి దంపతులు భోజనాన్ని వడ్డించారు. ఆ తర్వాత టోకెన్ తీసుకుని మరీ అక్కడే భోజనం చేశారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా పదుల సంఖ్యలో అన్న క్యాంటీన్లు పున:ప్రారంభించి పేదవాడి ఆకలి తీరుస్తున్నారు. మొత్తం 200 అన్న క్యాంటీన్లను ప్రారంభించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే.. మొదటివిడతలో వంద వరకు అందుబాటులోకి తీసుకొచ్చారు. మిగతావి అతి త్వరలో అందుబాటులోకి తీసుకొస్తామని చెపుతున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
అన్న క్యాంటీన్లలో ఒక మనిషికి ఒక రోజు భోజనం ఖర్చు 96 రూపాయలు అవుతుందని ప్రభుత్వం తెలిపింది. దీన్ని కేవలం 15 రూపాలయకే పేదలకు నాణ్యమైన, రుచికరమైన భోజనం అందిస్తోంది. మిగిలిన డబ్బును ప్రభుత్వమే భరిస్తోంది. అందుకోసమే… దాతలు ముందుకు రావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఈ పిలుపు మేరకు భారీగా దాతలు ముందుకు వచ్చి తమ వంతు సాయం అందిస్తున్నారు. మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు (Former MP Gokaraju Gangaraju) కోటి రూపాయలు , టీడీపీ నేత శిష్టా లోహిత్ (TDP leader Shishtla Lohit) కోటి రూపాయలు, చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి కోటి , గుంటూరు మున్సిపల్ కమిషనర్ పులి శ్రీనివాసులు (Guntur Municipal Commissioner Puli Srinivasulu) తన వంతుగా 25వేలు, గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ (MLA Naseer Ahmed).. ప్రతి శుక్రవారం మధ్యాహ్నం తన నియోజకవర్గంలోని రెండు అన్న క్యాంటీన్లలో భోజనం ఖర్చు భరిస్తానంటూ ముందుకొచ్చారు. అలాగే ప్రత్తిపాడు ఎమ్మెల్యే బి.రామాంజనేయులు (Prattipadu MLA B. Ramanjaneyu) తన జీతం నుంచి 30వేల రూపాయిలు విరాళంగా ఇస్తున్నట్టు ప్రకటించారు. వీరే కాక పార్టీ కార్యకర్తలు , ఇతర పార్టీ నేతలు సైతం తమ వంతు సాయం అందిస్తూనే ఉన్నారు.
Read Also : Congress History : కాంగ్రెస్ చరిత్ర కేటీఆర్‌కు తెలియదు – జగ్గారెడ్డి