Congress History : కాంగ్రెస్ చరిత్ర కేటీఆర్‌కు తెలియదు – జగ్గారెడ్డి
తెలంగాణ సచివాలయం ఎదురుగా రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటుకు కాంగ్రెస్ సిద్ధం అవుతుంటే..దీనిపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేసారు
- By Sudheer Published Date - 03:57 PM, Tue - 20 August 24

తెలంగాణ (Telangana) లో కాంగ్రెస్ – బిఆర్ఎస్ (Congress – BRS) మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. మొన్నటి వరకు రుణమాఫీ ఫై నువ్వా ..నేనే అనే రేంజ్ లో ఇరు పార్టీల నేతలు మాటలు వదులుకున్నారు. ఇక ఇప్పుడు రాజీవ్ గాంధీ విగ్రహం ఫై ఒకరిపై ఒకరు మాటల యుద్ధం చేసుకుంటున్నారు. తెలంగాణ సచివాలయం (Telangana Secretariat) ఎదురుగా రాజీవ్ గాంధీ విగ్రహం (Statue of Rajiv Gandhi ) ఏర్పాటుకు కాంగ్రెస్ సిద్ధం అవుతుంటే..దీనిపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేసారు. సచివాలయం ఎదురుగా రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పటు చేయడం తగదని..ఒకవేళ ఏర్పాటు చేస్తే తమ ప్రభుత్వం వచ్చిన రోజే కూల్చేస్తామని కేటీఆర్ (KTR) హెచ్చరించారు. దీంతో కాంగ్రెస్ నేతలు కేటీఆర్ ఫై మండిపడుతున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
బీఆరెస్ నేతలకు అధికారం పోయినా బలుపు తగ్గలేదని, సచివాలయం ముందు దొంగలకు, తాగుబోతులకు స్థానం లేదని, అధికారంలోకి వస్తే రాజీవ్ విగ్రహాన్ని తొలగిస్తామని మాట్లాడుతున్నారని ,చేతనైతే ఎవడైనా విగ్రహం మీద చేయి వేయాలంటూ సీఎ రేవంత్ సవాల్ చేశారు. ఇదే అంశం ఫై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మాట్లాడుతూ.. దేశం కోసం రాజీవ్ గాంధీ మిలిటెంట్ల చేతిలో అన్యాయంగా ప్రాణాలు కోల్పోయారని అది ఎవరూ చెరపలేని చరిత్ర అని , అధికారం కోల్పోయిన బాధలో కేటీఆర్ ఏం మాట్లాడుతున్నాడో తనకైనా అర్థం కావడం లేదని జగ్గారెడ్డి అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఈ రాష్ట్రాన్ని పాలించేందుకు క్లియర్ మ్యాండేట్ ఇచ్చారని ఇందులో కేటీఆర్‌కు కలుగుతున్న బాధ ఏంటో తమకు అర్థం కాలేదని అన్నారు. సచివాలయం ముందు దేశం కోసం ప్రాణత్యాగం చేసిన ఓ మాజీ ప్రధాని విగ్రహాన్ని పెడితే ఇంత అక్కసు ఎందకని ప్రశ్నించారు. ఇప్పటికైనా ఏం ఆలస్యం కాలేదని.. కేటీఆర్‌కు కేసీఆర్ కాస్త పొలిటికల్‌గా ట్రైనింగ్ ఇస్తే మంచిదని జగ్గారెడ్డి సలహా ఇచ్చారు.
Read Also : Alai Balai: సీఎం రేవంత్ రెడ్డి, గవర్నర్ బండారు దత్తాత్రేయ అలాయ్ బలాయ్