CM JAGAN : ఏపీ సీఎం కీలక ప్రకటన….31 లక్షల కుటుంబాలకు ఇళ్ళ పట్టాలు..!!
స్వాతంత్య్ర వేడుకల ఉపన్యాసంలో తమ సర్కార్ తీసుకు వచ్చిన సంక్షేమ పథకాలను, అభివృద్ధి కార్యక్రమాలను ఏపీ సీఎం జగన్ వివరించారు.
- By hashtagu Published Date - 11:06 AM, Mon - 15 August 22

స్వాతంత్య్ర వేడుకల ఉపన్యాసంలో తమ సర్కార్ తీసుకు వచ్చిన సంక్షేమ పథకాలను, అభివృద్ధి కార్యక్రమాలను ఏపీ సీఎం జగన్ వివరించారు. 31 లక్షల కుటుంబాలకు ఇళ్ళ పట్టాలను ఇచ్చాము. ఇంకా ఇస్తున్నామని సీఎం వైస్ జగన్ ప్రకటించారు. రుపాయి లంచం తీసుకోకుండా 2,7లక్షల మంది వాలంటీర్లు ఇంటికి వెళ్లి పెన్షన్లు ఇచ్చే వ్యవస్థ ఏర్పాటు చేశామని..ప్రతి రెండువేలమందికి పౌర సేవలు అందించే విధంగా గ్రామ, వార్డు సచివాలయాలు ఉన్నట్లు సీఎం తెలిపారు.
ఇక విత్తనం నుంచి పంట వరకు రైతులకు సేవలు అందించేందుకు రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయన్నారు జగన్. పాలన వికేంద్రీకరణ కోసం అదనంగా 13 జిల్లాలను ఏర్పాటు చేసిట్లు తెలిపారు. వైఎస్సార్ రైతు భరోసాతో 52లక్షల మంది రైతు కుటుంబాలకు ఏటా 13,500రూపాయల ఆర్థిక సాయం అందిస్తున్నట్లు చెప్పారు. పగటిపూట తొమ్మిది గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్తు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఇళ్ళ నిర్మాణం పూర్తి అయిన తర్వాత ఒక్కో ఇంటి విలువ కోసం 7 నుంచి 10లక్షల రూపాయలు ఉంటుందని…పెత్తందారీ పోకడలను అడ్డుకోనేందుకు ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియం అమలు చేయాలని నిర్ణయించాం. ఈ మూడేళ్లలో విద్యా రంగంమీద 53వేల కోట్లు ఖర్చు చేసినట్లు ఈ సందర్భంగా గుర్తు చేశారు ముఖ్యమంత్రి జగన్ .