Janasena Symbol:హైకోర్టులో జనసేనకు భారీ ఊరట.. గాజు గ్లాసు గుర్తు పిటిషన్ కొట్టివేత
ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ మరియు లోకసభ ఎన్నికలు ఏకకాలంలో జరగనున్నాయి. గెలుపే లక్ష్యంగా ప్రాంతీయ పార్టీలు తమ ఎన్నికల ప్రచారంలో నిమగ్నమయ్యాయి. ఎన్డీయే కూటమిలో భాగంగా టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తుండగా, వైసీపీ మాత్రమే ఒంటరిగా బరిలోకి దిగుతుంది.
- By Praveen Aluthuru Published Date - 12:42 PM, Tue - 16 April 24

Janasena Symbol: ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ మరియు లోకసభ ఎన్నికలు ఏకకాలంలో జరగనున్నాయి. గెలుపే లక్ష్యంగా ప్రాంతీయ పార్టీలు తమ ఎన్నికల ప్రచారంలో నిమగ్నమయ్యాయి. ఎన్డీయే కూటమిలో భాగంగా టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తుండగా, వైసీపీ మాత్రమే ఒంటరిగా బరిలోకి దిగుతుంది. ఇదిలా ఉండగా జనసేన పార్టీ సింబల్ గ్లాజు గుర్తును గత కొద్దిరోజులుగా వివాదాలు చుట్టుముట్టాయి.
We’re now on WhatsApp. Click to Join
జనసేనకు గాజు గ్లాస్ గుర్తు కేటాయింపును సవాల్ చేస్తూ హైకోర్టు లో పిటిషన్ వేయడంతో ఆ పార్టీకి ఎదురుదెబ్బ తగిలినట్టైంది. అయితే జనసేనకు గాజు గుర్తుపై దాఖలైన పిటిషన్ ని సవాల్ చేస్తూ జనసేన తరుపున మరో పిటిషన్ దాఖలు చేశారు. కాగా ఈ రోజు విచారించిన ధర్మాసనం జనసేనకు గాజు గ్లాస్ గుర్తు కేటాయింపును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ ను హైకోర్టు మంగళవారం కొట్టేసింది. దీంతో ఎన్నికల వేళ ఆ పార్టీకి భారీ ఊరట లభించింది. జనసేనకు గాజు గ్లాస్ గుర్తు కేటాయించడంపై రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ (సెక్యులర్) పార్టీ ఫౌండర్ ప్రెసిడెంట్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
Also Read: Ebon Urine Cup : ‘ఎబోన్ యూరిన్ కప్’ వచ్చేసింది .. డ్రగ్స్ సేవించే వారికి చెక్