AP High Court: జగర్ సర్కార్ కు ఊహించని షాకిచ్చిన హైకోర్టు..!!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ కు ఏపీ హైకోర్ట్ గట్టి వార్నింగ్ ఇచ్చింది. వైజాగ్ రుషికొండ దగ్గర నిర్మాణాలపై హైకోర్టులో విచారణ జరిగింది.
- By Bhoomi Published Date - 10:19 AM, Tue - 6 September 22

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ కు ఏపీ హైకోర్ట్ గట్టి వార్నింగ్ ఇచ్చింది. వైజాగ్ రుషికొండ దగ్గర నిర్మాణాలపై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ నిర్మాణాలకు అనుమతులు లేవని తేలితే…కూల్చివేతకు ఆదేశాలు జారీ చేస్తామని కోర్టు తెలిపింది. వ్యక్తిగత కారణాలతో ప్రభుత్వ ప్రత్యేక అడ్వకేట్ విచారణకు హాజరు కాలేకపోయారు. విచారణను వాయిదా వేయాలని ఏజీ ఎస్. శ్రీరామ్ కోర్టును కోరారు.
రుషికొండలో ఎలాంటి అనుమతులు లేకుండానే నిర్మాణాలు కొనసాగుతున్నాయని వాటిపై తొందరగా విచారణ జరపాలని పిటీషనర్ మూర్తి తరపు అడ్వకేట్ కోరారు. గతంలో తాము ఇచ్చిన ఆదేశాలకు వ్యతిరేకంగా నిర్మాణాలు జరిగితే .కూల్చివేతకు ఆదేశాలు ఇస్తామంటూ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ డివిఎస్ఎస్ సోమయాజులతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ విచారణను ఈనెల 22వ తేదీకి వాయిదా వేసింది.
Related News

Lokesh on Jagan: బినామీలతో జగన్ దోపిడీ : మూడో రోజు పాదయాత్రలో లోకేష్
నారా లోకేశ్ యువగళం పాదయాత్ర ఉత్సాహంగా కొనసాగుతోంది. మూడో రోజు కుప్పం నియోజకవర్గం శాంతిపురం మీదుగా వెళ్తున్న లోకేశ్‌కు మహిళలు తిలకం దిద్ది హారతులు పట్టారు.