HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Heavy Rains To Continue In Ap Due To Expected Cyclone In Bay Of Bengal

Cyclone In AP : ఏపీకి తుపాను హెచ్చరిక‌… ఆ ప్రాంతాల్లో భారీ వ‌ర్షాలు కురిసే ఛాన్స్‌

వారాంతంలో ఆంధ్రప్రదేశ్‌కు తుపాను ముప్పు ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ అండమాన్ సముద్రం పరిసరాల్లో...

  • By Prasad Published Date - 11:18 AM, Wed - 19 October 22
  • daily-hunt
Rains
Rains

వారాంతంలో ఆంధ్రప్రదేశ్‌కు తుపాను ముప్పు ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ అండమాన్ సముద్రం పరిసరాల్లో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం అక్టోబరు నాటికి అల్పపీడనంగా బలపడి 22వ తేదీ ఉదయం పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించి తుపానుగా మారే అవకాశం ఉందని పేర్కొంది. గాలి మరింత బలపడి తుపానుగా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు. దీని ప్రభావంతో రాష్ట్రంలో ముఖ్యంగా కోస్తా ఆంధ్ర, రాయలసీమల్లో బుధ, గురువారాల్లో ఉరుములు, మెరుపులతో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ నెల 20, 21, 22 తేదీల్లో సముద్ర తీరంలో బలమైన గాలులు వీచే అవకాశం ఉంది. మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లవద్దని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం సూచించింది. అయితే ఈ తుపాను సూపర్ సైక్లోన్‌గా మారుతుందో లేదో అంచనా వేయలేమని వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల ప్రకారం తుపాను ఉత్తర కోస్తా ఆంధ్ర, దక్షిణ ఒడిశా మధ్య తీరం దాటే అవకాశం ఉంది. రానున్న నాలుగైదు రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని చెబుతున్నారు. మరోవైపు మంగళవారం విజయవాడలో భారీ వర్షం కురిసి అత్యధికంగా కొయ్యూరు మండలం కాకరపాడులో 5.6, తాడేపల్లిగూడెంలో 5.6, సోమలో 5.4, విజయవాడలో 5.1, కంభం మండలం రావిపాడులో 5, రాజమహేంద్రవరంలో 4.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • cyclone
  • Heavy rains in AP
  • rains

Related News

Harishrao Hyd Floods

Floods In HYD : సీఎం రేవంత్ వల్లే నేడు హైదరాబాద్ జ‌ల దిగ్బంధం – హరీష్ రావు

Floods In HYD : సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth) రాజకీయాలు పక్కన పెట్టి వరదలో చిక్కుకున్న వారిని సురక్షితంగా తరలించడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని, పరిసర ప్రాంత ప్రజలను తరలించి వారికి పూర్తి సహాయం అందించాలని హరీశ్‌రావు విజ్ఞప్తి చేశారు

    Latest News

    • ‎Dussehra: దసరా పండుగకు అంతా మంచే జరగాలంటే ఇంట్లో నుంచి వీటిని తొలగించాల్సిందే!

    • ‎Dussehra: దసరా రోజు జమ్మి చెట్టు ఆకులను ఇంటికి తెచ్చుకుంటే ఏం జరుగుతుందో మీకు తెలుసా?

    • AP Govt : పెన్షన్ల పంపిణీకి రూ. 2745 కోట్లు విడుదల

    • YCP Sainyam : నియోజకవర్గానికి 8000 మందితో YCP సైన్యం

    • Bathukamma : గిన్నిస్ రికార్డు సాధించిన బతుకమ్మ

    Trending News

      • Donald Trump: ట్రంప్ మరో సంచ‌ల‌న నిర్ణ‌యం.. సినిమాల‌పై 100 శాతం టారిఫ్‌!

      • Speed Post: 13 సంవ‌త్స‌రాల త‌ర్వాత స్పీడ్ పోస్ట్‌లో భారీ మార్పులు!

      • India: ఐసీసీ టోర్న‌మెంట్ల నుండి టీమిండియాను స‌స్పెండ్ చేయాలి: పాక్ మాజీ ఆట‌గాడు

      • Team India: ఆసియా క‌ప్ ట్రోఫీ లేకుండానే సంబ‌రాలు చేసుకున్న టీమిండియా!

      • Bank Holidays: అక్టోబర్‌లో బ్యాంకుల సెలవుల పూర్తి జాబితా ఇదే!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd