Hari Rama Jogaiah : పవన్ కళ్యాణ్ ను కలిసిన కాపు సంక్షేమ సంఘం అధ్యక్షుడు
- By Sudheer Published Date - 09:41 PM, Thu - 11 January 24

గత కొద్దీ రోజులుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కు వరుసగా బహిరంగ లేఖలు రాస్తూ వస్తున్న కాపు సంక్షేమ సంఘం అధ్యక్షుడు హరిరామ జోగయ్య (Hari Rama Jogaiah )..గురువారం సాయంత్రం మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో పవన్ కళ్యాణ్‌తో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా ఇరువురు తాజా రాజకీయాలపై చర్చలు జరిపారు. రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీ తప్పక విజయం సాధించాలని హరిరామ జోగయ్య ఆకాంక్షించారు. ఏపీలోజగన్‌ను ఢీ కొని అధికారంలోకి రావాలంటే అనుసరించాల్సిన వ్యూహాలను, ప్రవేశపెట్టాల్సిన పథకాలను పవన్ కల్యాణ్‌కు సూచించారు. జగన్ మరోసారి అధికారం చేపట్టడమే ధ్యేయంగా నవరత్నాలు పేర కొనసాగిస్తున్న సంక్షేమ పథకాలపైనే ఆధారపడిన మాట వాస్తవమేనని అన్నారు. సంక్షేమాన్ని సంక్షేమంతోనే కొట్టాలని సూచించారు.
We’re now on WhatsApp. Click to Join.
వైసీపీ ప్రభుత్వంలో నిత్యావసరాల ధరలు, ఇతర ఛార్జీలు భారీగా పెరిగాయని… వాటి నుంచి ఉపశమనం కలిగించేందుకు ప్రతి కుటుంబానికి రూ. 2 వేలు అందేలా చూడాలని సూచించారు. తెల్ల రేషన్ కార్డు ఆధారంగా కుటుంబంలో ఒకరి కంటే ఎక్కువ మంది వృద్ధులు ఉన్నా… నెలకు రూ. 4 వేల పెన్షన్ అందించాలని అన్నారు. అలాగే విద్యుత్ బిల్లులపై 20 శాతం సబ్సిడీ ఇవ్వాలని పేర్కొన్నట్లు తెలుస్తుంది.
జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారితో సీనియర్ నేత మాజీ హోమ్ శాఖ మంత్రి, కాపు సంక్షేమ సేన అధ్యక్షులు శ్రీ చేగొండి హరిరామజోగయ్య గారు సమావేశమయ్యారు. వర్తమాన రాజకీయ అంశాలు, రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై సుదీర్ఘంగా చర్చించారు.రానున్న సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించాలని శ్రీ… pic.twitter.com/RSxQuk1spM
— JanaSena Party (@JanaSenaParty) January 11, 2024
Read Also : YCP 3rd List : వైసీపీ మూడో లిస్ట్ వచ్చేసింది..