AP : కృష్ణా జిల్లాలో వ్యవసాయ శాఖ అధికారి చేతివాటం..
ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తూ..భారీగా జీతాలు అందుకుంటూనే అడ్డా దారుల్లో కొంతమంది తమ జేబులు నింపుకుంటారు. కొంతమంది లంచాలు తీసుకుంటూ ఉంటె..మరికొంతమంది ప్రజలకు..ప్రభుత్వం ద్వారా లభించే సొమ్మును కూడా కాజేస్తుంటారు
- By Sudheer Published Date - 06:48 PM, Mon - 27 May 24

ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తూ..భారీగా జీతాలు అందుకుంటూనే అడ్డా దారుల్లో కొంతమంది తమ జేబులు నింపుకుంటారు. కొంతమంది లంచాలు తీసుకుంటూ ఉంటె..మరికొంతమంది ప్రజలకు..ప్రభుత్వం ద్వారా లభించే సొమ్మును కూడా కాజేస్తుంటారు. తాజాగా కృష్ణా జిల్లాలో ఇదే జరిగింది. రైతుల ఖాతాల్లో జమకావాల్సిన పంట నష్టం సొమ్మును వారి ఖాతాల్లో వేసుకొని వార్తల్లో నిలిచారు. ఈ విషయం రైతులకు తెలిసి తమను అధికారులు నట్టేట ముంచేశారని వాపోయారు. గత వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు తమ ఖాతాలో జమ అవ్వవలసిన నష్టపరిహారం సొమ్మును గోల్మాల్ చేశారంటూ అగ్రికల్చర్ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు.
We’re now on WhatsApp. Click to Join.
పెడన మండలం మార్కెట్ యాడ్ లో ఉన్న వ్యవసాయ శాఖ కార్యాలయంలో పనిచేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్ యార్లగడ్డ నాగ మల్లేశ్వరావు..రైతులకు అందాల్సిన డబ్బులు కాజేశారని ఆరోపణలు వస్తున్నాయి. అతడు తన బంధువులు స్నేహితులు తదితర సాయాంతో ఆధార్ కార్డులు బ్యాంక్ అకౌంట్లు జిరాక్స్ లు తీసుకొని.. రైతులకు పడవలసిన నష్టపరిహారం ఫేక్ అకౌంట్ లో పడేవిధంగా ఏర్పాటు చేసుకున్నారు. దీనికి గల కారణం ఆ శాఖ చెందిన అగ్రికల్చర్ అధికారి ఏఓ ప్రమేయం ఉందనే ఆరోపణలు వస్తున్నాయి. కొంతమంది రైతులు ఏవో వద్ద శ్రీనివాసరావు వద్ధ ఆందోళనకు దిగారు. చిన్న సన్న కారు రైతులకు వారి నష్టపరిహారం ఎకరానికి రూ. 6000 పడగా…కొంతమందికి ఎనిమిది వేల రూపాయలు కూడా జమయ్యాయి. మరి కొంతమంది రైతులకు రూ.32 వేల నుంచి లక్ష రూపాయల వరకు కూడా వారి ఖాతాలో పడినట్లు సమాచారం. అసలు పొలం లేని వారికి ఖాతాలో ఎలా వచ్చాయని రైతులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరి దీనిపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.
Read Also : Vizag : మనువరాలిపై తాత అత్యాచారం..20 ఏళ్ల పాటు జైలు శిక్ష విధించిన కోర్ట్