Gunda Jayaprakash Naidu : గత ఎన్నికల్లో డబ్బులు పంచిన జనసేన నేత.. ఇప్పుడు అరెస్ట్..
పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరం మండలం జడ్పిటిసి, జనసేన నేత గూండా జయప్రకాష్ నాయుడుని(Gunda Jayaprakash Naidu) హైదరాబాదు(Hyderabad) లో నేడు అరెస్ట్ చేశారు.
- Author : News Desk
Date : 13-09-2023 - 8:00 IST
Published By : Hashtagu Telugu Desk
ఏపీ(AP)లో చంద్రబాబు(Chandrababu Naidu) అరెస్టు రాజకీయాల్లో హీట్ పెంచుతుంది. పలువురు టీడీపీ(TDP) నేతలని కూడా హౌస్ అరెస్ట్ చేశారు. తాజాగా ఓ జనసేన(Janasena) నేతని పోలీసులు అరెస్ట్ చేశారు. పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరం మండలం జడ్పిటిసి, జనసేన నేత గూండా జయప్రకాష్ నాయుడుని(Gunda Jayaprakash Naidu) హైదరాబాదు(Hyderabad) లో నేడు అరెస్ట్ చేశారు.
2019 ఏపీ ఎన్నికల్లో పాలకోడేరు మండలం శృంగ వృక్షం గ్రామంలో ఓటర్లకు డబ్బులు పంచుతూ పోలీసులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికాడు జయప్రకాష్ నాయుడు. అప్పట్లో జయప్రకాష్ నాయుడుపై పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయి కోర్టు వరకు వెళ్ళింది. ఆ కేసు ఇంకా కోర్టులో సాగుతూ వాయిదాలు పడుతూ వస్తుంది. అయితే ఇటీవల కోర్టు వాయిదాలకు జయప్రకాశ్ హాజరు కాకపోవడంతో కోర్టు ధిక్కరణ కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు.
జయప్రకాష్ నాయుడును హైదరాబాదులో అరెస్టు చేసి పాలకోడేరు పోలీస్ స్టేషన్ కి తీసుకువెళ్లారు పోలీసులు. దీనిపై జనసేన నాయకులు ఎవరూ ఇంకా స్పందించలేదు. అయితే గతంలో కూడా జయప్రకాశ్ నాయిడుపై గుండాయిజం, భూకబ్జాలు చేశాడని పలు వార్తలు వచ్చాయి. గతంలో కూడా జయప్రకాశ్ ఓ సారి అరెస్ట్ అయ్యాడు.
Also Read : Varla Ramaiah : మంత్రి రోజాపై వర్ల రామయ్య ఫైర్.. బాబు అధికారంలోకి రాగానే మొదట జైలుకు వెళ్ళేది రోజానే..