Cyclone Michaung: తుపాను ముంచుకొస్తోంది..ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలి: పవన్ కళ్యాణ్
మిచాంగ్ తుఫాన్ ఏపీపై తీవ్ర ప్రభావం చూపబోతోందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిందని, ప్రభుత్వ యంత్రాంగం సహాయక చర్యలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పవన్ కళ్యాణ్ కోరారు.
- Author : Praveen Aluthuru
Date : 04-12-2023 - 11:32 IST
Published By : Hashtagu Telugu Desk
Cyclone Michaung: మిచాంగ్ తుఫాన్ ఏపీపై తీవ్ర ప్రభావం చూపబోతోందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిందని, ప్రభుత్వ యంత్రాంగం సహాయక చర్యలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పవన్ కళ్యాణ్ కోరారు. తీవ్ర తుపాను వచ్చే అవకాశం ఉందని, అప్రమత్తంగా ఉండాలన్నారు.ఇది తీవ్రమైన తుఫాను అని రెడ్ అలర్ట్ కూడా జారీ అయింది, కాబట్టి తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు అవసరమైన సహాయక చర్యల్లో పాలుపంచుకోవాలని… ఆహారం, మందులు వంటి అత్యవసర వస్తువులను అందించాలని జనసేన నాయకులు, కార్యకర్తలకు పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. తుపాను నష్టాన్ని క్షేత్రస్థాయిలో అంచనా వేయాలని పార్టీ నేతలకు కూడా సూచిస్తున్నామన్నారు.పంటలు చేతికి వచ్చే సమయమని, పంటలు నష్టపోయే అవకాశాలు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల రైతులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పంట నష్టపరిహారం లెక్కింపులో అధికారులు మానవతా దృక్పథంతో వ్యవహరించాలని పవన్ కల్యాణ్ విజ్ఞప్తి చేశారు.
Also Read: Chandrababu : తుపాను సహాయక చర్యలపై ప్రభుత్వం దృష్టిపెట్టాలన్న టీడీపీ అధినేత చంద్రబాబు