AP Govt : ఇక తెలుగులోనూ ప్రభుత్వ ఉత్తర్వులు
AP Govt : ఈ నిర్ణయం తెలుగు భాషకు ప్రాధాన్యం ఇస్తూ, ప్రజలతో ప్రభుత్వానికి సమీప సంబంధాన్ని పెంచేందుకు తీసుకున్నదిగా అధికారులు పేర్కొన్నారు
- By Sudheer Published Date - 07:47 PM, Fri - 3 January 25

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం (AP Govt) తాజాగా ప్రజా అనుకూల నిర్ణయం తీసుకుంది. ఇకపై అన్ని ప్రభుత్వ ఉత్తర్వులు (Government Orders) ఇంగ్లీష్ తో పాటు తెలుగు(Telugu)లోనూ అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఈ నిర్ణయం తెలుగు భాషకు ప్రాధాన్యం ఇస్తూ, ప్రజలతో ప్రభుత్వానికి సమీప సంబంధాన్ని పెంచేందుకు తీసుకున్నదిగా అధికారులు పేర్కొన్నారు.
High Blood Pressure : మీకు హైబీపీ ఉందా..? అయితే ఈ ఆహారం అస్సలు తినొద్దు..!
తెలుగు రాష్ట్ర అధికార భాష కావడంతో ప్రభుత్వ ఉత్తర్వులు స్థానిక భాషలో కూడా ఉండాలని ఎన్నో రోజులుగా డిమాండ్లు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రభుత్వ విభాగాలకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది. ప్రజలకు సులభంగా అర్థమయ్యే విధంగా తెలుగులో ఉత్తర్వులు ఇవ్వడం అనివార్యమని ప్రభుత్వం పేర్కొంది. మొదటగా ఆంగ్లంలో ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేయాలని, తరువాత వెబ్‌సైట్లలో అప్లోడ్ చేసి, రెండు రోజుల్లో తెలుగులోనూ విడుదల చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ విధానం ద్వారా ప్రజలకు సమాచారాన్ని త్వరగా అందుబాటులోకి తీసుకురావడం సులభమవుతుంది. ఈ నిర్ణయంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇంగ్లిష్‌ను అర్థం చేసుకోలేని గ్రామీణ ప్రజలకు తెలుగులో ఉత్తర్వులు అందుబాటులో ఉండటం వల్ల అనేక సమస్యలు తీరతాయని వారు అభిప్రాయపడుతున్నారు. తెలుగు భాషకు ప్రభుత్వం ఇచ్చిన ప్రాధాన్యంపై భాషాభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Chandrababu : చంద్రబాబు ఒక కర్మయోగి – సచ్చిదానందస్వామి
తెలుగులో ప్రభుత్వ ఉత్తర్వులు ఇవ్వడమే కాకుండా అన్ని శాఖల్లోనూ తెలుగు భాషను విస్తృతంగా ఉపయోగించాలని ప్రజలు ఆశిస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో తెలుగులో చర్చలు, రికార్డులు నిర్వహించడం సాధ్యమైతే ప్రజలకు మరింత సౌకర్యవంతంగా ఉంటుందని అంటున్నారు.