Chandrababu : చంద్రబాబు ఒక కర్మయోగి – సచ్చిదానందస్వామి
Chandrababu : విజయవాడలో స్వామీజీ చేపట్టిన "ఆంధ్రప్రదేశ్ 42 ఊర్ల దత్తక్షేత్ర నాద యాత్ర-2025"ను ముఖ్యమంత్రి ప్రారంభించారు
- By Sudheer Published Date - 05:15 PM, Fri - 3 January 25

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(CM Chandrababu)ను గణపతి సచ్చిదానంద స్వామి (Ganapathi Sachchidananda) కర్మయోగి(Karma Yogi)గా ప్రశంసించారు. విజయవాడలో స్వామీజీ చేపట్టిన “ఆంధ్రప్రదేశ్ 42 ఊర్ల దత్తక్షేత్ర నాద యాత్ర-2025″ను ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ, చంద్రబాబు సంకల్పం మరియు కార్యదీక్ష రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రగా మార్చేందుకు దోహదపడుతుందని తెలిపారు.
Game Changer : ఐమ్యాక్స్ లో ‘గేమ్ ఛేంజర్’..మెగా ఎక్స్ పీరియన్స్ మాములుగా ఉండదు మరి ..!!
చంద్రబాబు సంకల్పంతో రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఆయన కృషి రాష్ట్ర ప్రజల కోసం అనితరసాధ్యమైనదని తెలిపారు. చంద్రబాబు సమర్థవంతంగా పాలన కొనసాగించాలని, ప్రజల సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి కోసం చంద్రబాబు చేస్తున్న కృషి రాష్ట్రానికి వెలుగులు తెస్తుందని స్వామీజీ అభినందించారు. స్వర్ణాంధ్ర సాధన కోసం స్వామీజీ ఆశీస్సులు ఎప్పటికీ చంద్రబాబుతో ఉంటాయని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరు ఆధ్యాత్మికతను అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు.
Aparna Malladi : కాన్సర్ తో తెలుగు డైరెక్టర్ కన్నుమూత
ఇక చంద్రబాబు మాట్లాడుతూ..స్వర్ణాంధ్ర ప్రదేశ్ సాధనకు తాను నిరంతరం కృషి చేస్తున్నానని, తన విజన్ 2020ను అందరూ మొదట్లో అర్థం చేసుకోలేకపోయినా, ప్రస్తుతం ఆ విజయాలు అందరికీ స్పష్టంగా కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. ఇప్పుడు విజన్ 2047 కోసం పనిచేస్తున్నానని, భవిష్యత్ తరాలకు సంపదను అందించడమే తన లక్ష్యమని అన్నారు. స్వామీజీ ఆశీస్సులు తనకు ప్రేరణగా నిలిచాయని ముఖ్యమంత్రి అన్నారు. కష్టకాలంలో స్వామీజీ చేసిన పూజల ద్వారా తనకు ఎంతో శుభం కలిగిదన్నారు. ప్రతి వ్యక్తి ఆనందంగా ఉండాలంటే స్పిరిచ్యువాలిటీ ముఖ్యం అని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.
ఈ పర్యటనలో సీఎం చంద్రబాబు వెంట రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి కూడా ఉన్నారు. కాగా, చంద్రబాబుకు సచ్చిదానంద ఆశ్రమ వర్గాలు ఘనస్వాగతం పలికాయి.
విజయవాడ పటమటలోని గణపతి సచ్చిదానంద ఆశ్రమానికి వెళ్ళిన సీఎం చంద్రబాబు. పీఠాధితుల ఆశీర్వచనం తీసుకున్న సీఎం. #ChandrababuNaidu #AndhraPradesh #Vijayawada #HashtagU pic.twitter.com/ORvnJiLMmG
— Hashtag U (@HashtaguIn) January 3, 2025
స్వర్ణాంధ్రప్రదేశ్ ను తీర్చిదిద్దాలన్నదే నా సంకల్పం #ChandrababuNaidu#AndhraPradesh pic.twitter.com/d1qlb7syrs
— Telugu Desam Party (@JaiTDP) January 3, 2025
సమాజం కోసమే శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ పనిచేస్తున్నారు… సీఎం చంద్రబాబు #ChandrababuNaidu #AndhraPradesh pic.twitter.com/b2WHrw9GVe
— Telugu Desam Party (@JaiTDP) January 3, 2025
చంద్రబాబు గారు ఒక్కో కార్యక్రమం చేసుకుంటూ వెళ్తున్నారు. అభివృద్ధి చేయటానికి, చంద్రబాబు గారికి సమయం ఇవ్వండి. చెడు చేయాలి అంటే వెంటనే చేయొచ్చు, మంచి చేయటానికి సమయం పడుతుందని ప్రజలు అర్ధం చేసుకోవాలి. నిన్నటి వరకు మీ రాజ్యం ఏది అంటే, ఏమి చెప్పాలో తెలిసేది కాదు. ఇప్పుడు మళ్ళీ మన… pic.twitter.com/CTxITQB0xo
— Telugu Desam Party (@JaiTDP) January 3, 2025