Dussehra Holidays 2025 : స్కూల్ విద్యార్థులకు గుడ్ న్యూస్..ఇక సంబరాలకు సిద్ధం కండి
Dussehra Holidays 2025 : ఈసారి దసరా సెలవులు వాస్తవానికి మరింత ఎక్కువ రోజులు కొనసాగనున్నాయి. ఎందుకంటే సెప్టెంబర్ 21 ఆదివారం కావడంతో ఆ రోజే విద్యార్థులకు స్కూల్ సెలవులు మొదలవుతాయి
- By Sudheer Published Date - 02:30 PM, Fri - 19 September 25

ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు ఈసారి దసరా పండుగ సందర్భంగా అదనపు సెలవులు (Dussehra Holidays) దక్కాయి. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ((Lokesh) ) తాజాగా చేసిన ప్రకటనతో విద్యార్థులు, ఉపాధ్యాయులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ముందుగా ప్రభుత్వం ప్రకటించిన దసరా సెలవులు సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2 వరకు మాత్రమే ఉండేవి. అయితే టీడీపీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు, ఉపాధ్యాయుల కోరిక మేరకు మంత్రి నారా లోకేష్ విద్యాశాఖ అధికారులతో చర్చించి రెండు రోజులు ముందుగానే సెలవులు ప్రారంభించాలని నిర్ణయించారు. దీంతో ఇప్పుడు సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 వరకు సెలవులు ఉంటాయి.
ఈసారి దసరా సెలవులు వాస్తవానికి మరింత ఎక్కువ రోజులు కొనసాగనున్నాయి. ఎందుకంటే సెప్టెంబర్ 21 ఆదివారం కావడంతో ఆ రోజే విద్యార్థులకు స్కూల్ సెలవులు మొదలవుతాయి. దాంతో మొత్తం 12 రోజుల పాటు విద్యార్థులు స్కూల్‌ల నుంచి దూరంగా ఉంటారు. దీర్ఘకాలిక సెలవులు రావడం వల్ల విద్యార్థులు తమ కుటుంబ సభ్యులతో కలిసి పండుగ వాతావరణాన్ని ఆనందంగా గడపడానికి వీలవుతుంది. ముఖ్యంగా పల్లె ప్రాంతాల్లో నివసించే విద్యార్థులు దసరా వేడుకల్లో సంప్రదాయాలను ఆస్వాదించడానికి ఎక్కువ సమయం దొరుకుతుంది.
Womens World Cup Anthem: మహిళల వరల్డ్ కప్ 2025.. శ్రేయా ఘోషల్ పాడిన పాటను విడుదల చేసిన ఐసీసీ!
తెలంగాణలో కూడా ఇదే తరహా పరిస్థితి ఉంది. అక్కడ ప్రభుత్వం సెప్టెంబర్ 21 నుంచి అక్టోబర్ 3 వరకు దసరా సెలవులు ప్రకటించింది. అంటే అక్కడ విద్యార్థులకు మొత్తం 13 రోజుల పాటు హాలిడేస్ లభిస్తున్నాయి. అక్టోబర్ 2న దసరా పండుగతో పాటు గాంధీ జయంతి కూడా ఉండటంతో ఒకే రోజు రెండు సెలవులు కలిసిపోయాయి. మొత్తంగా చూస్తే. తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థులు ఈ ఏడాది దసరా సందర్భంగా దీర్ఘకాలిక సెలవులను ఆస్వాదించే అవకాశాన్ని పొందుతున్నారు. పండుగ ఉత్సాహం, కుటుంబం తోడుగా ఉండడం, స్నేహితులతో సరదాగా గడపడం వంటి అంశాలతో ఈసారి దసరా హాలిడేస్ ప్రత్యేకంగా నిలవనున్నాయి.