Gold Sales : 2000 నోటు రద్దు వర్సెస్ గోల్డ్ అమ్మకాలు.. ఆ వార్తలన్నీ అవాస్తవమేనా?
కొంతమంది బడా బాబులు 2000 రూపాయల నోట్లను బంగారం(Gold) కొనడానికి వినియోగిస్తున్నారని, తమ డబ్బును బంగారంగా మార్చుకుంటున్నారని, గత రెండ్రోజులుగా బంగారం అమ్మకాలు పెరిగాయని వార్తలు వచ్చాయి.
- By News Desk Published Date - 06:30 PM, Tue - 23 May 23

ఇటీవల 2000 రూపాయల నోట్లను ఉపసంహరిస్తున్నట్టు RBI ప్రకటించి అందరికి షాక్ ఇచ్చింది. ఇప్పటికే 2000 రూపాయల నోట్ల చలామణి బాగా తగ్గిపోయింది. బడా బాబులు, అవినీతిపరులు 2000 రూపాయలను దాచేసినట్టు వార్తలు వచ్చాయి. ఉపసంహరణ తర్వాత 2000 రూపాయల నోట్లని బ్యాంకుల్లో మార్చుకోవచ్చని, డిపాజిట్ చేసుకోవచ్చుని RBI చెప్పింది. అయితే కొంతమంది బడాబాబులు ఆ 2000 రూపాయల నోట్లను మార్చడానికి అనేక మార్గాలు వెతుకుతున్నారు.
ఈ నేపథ్యంలోనే కొంతమంది బడా బాబులు 2000 రూపాయల నోట్లను బంగారం(Gold) కొనడానికి వినియోగిస్తున్నారని, తమ డబ్బును బంగారంగా మార్చుకుంటున్నారని, గత రెండ్రోజులుగా బంగారం అమ్మకాలు పెరిగాయని వార్తలు వచ్చాయి. తాజాగా దీనిపై ఏపీ గోల్డ్ మర్చంట్ అసోసియేషన్ స్పందించింది.
మీడియాలో గోల్డ్ అమ్మకాలపై వస్తున్న వార్తలు చూసి ఏపీ గోల్డ్ మర్చంట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి KSR నాయుడు మీడియాతో మాట్లాడుతూ.. 2000 నోట్లు రద్దు చేసిన తర్వాత గోల్డ్ కొనుగోలు పెరగలేదు. 2,000 నోట్లు రద్దు చేసిన తర్వాత గోల్డ్ కొనుగోలు పెరగటం అనేది పూర్తిగా అవాస్తవం. కావాలనే కొంతమంది గోల్డ్ కొనుగోలు పెరిగిందని చెప్తున్నారు. లోకల్ మార్కెట్ తో పాటు పెద్ద పెద్ద జ్యువెల్లరీ షాపుల్లో కూడా గోల్డ్ కొనుగోలు అంతగా లేదు. గోల్డ్ మర్చంట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా పూర్తి సమాచారం ఎప్పటికప్పుడు మా దగ్గరికి వస్తుంది. కాబట్టి అవన్నీ అవాస్తవాలు. నోట్లు రద్దు చేయడం మంచి పరిణామమే అని అన్నారు.
Also Read : RBI: రూ.2 వేల నోట్లను రద్దు చేయడానికి కారణం ఇదేనా.?.