Ghattamaneni Adiseshagiri Rao : పెనమలూరి టీడీపీ అభ్యర్థిగా ఘట్టమనేని ఆదిశేషగిరిరావు..?
- By Sudheer Published Date - 03:40 PM, Fri - 23 February 24

ఎన్నికల సమయం దగ్గర పడుతుండడం తో టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu)..తన రాజకీయ అనుభవం మొత్తం చూపిస్తున్నారు. గత ఎన్నికల్లో ఓటమి చవిచూసిన బాబు..ఈసారి ఎలాగైనా విజయం సాధించి జగన్ (Jagan) ను ఇంటికి పంపించాలని చూస్తున్నారు. ఇందుకు తగ్గట్లే వ్యూహాలు రచిస్తున్నారు. ఇప్పటికే జనసేన తో పొత్తు పెట్టుకొని ఓట్లు చీలకుండా చేసుకున్నాడు. త్వరలోనే బిజెపి కూడా టీడీపీ తో జత కట్టబోతుంది. ఇదే తరుణంలో కీలక నేతలకు టికెట్స్ ఇవ్వాలని చూస్తున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
తాజాగా పెనమలూరి (Penamaluru Constituency) టీడీపీ అభ్యర్థిగా ఘట్టమనేని ఆదిశేషగిరిరావు (Ghattamaneni Adiseshagiri Rao) ను బరిలోకి దింపాలని టీడీపీ వర్గం చూస్తున్నట్లు వినికిడి. ఆదిశేషగిరిరావు పోటీకి సై అంటున్నారు. 2019 ఎన్నికలకు కొద్దిరోజులు ముందు ఆయన వైసీపీ నుంచి టీడీపీ లో చేరిన సంగతి తెలిసిందే. ఆ తరువాత నుంచి పార్టీలో యాక్టివ్‌గా ఉంటున్నారు. చంద్రబాబు అరెస్ట్ అయిన తరువాత సినీ పరిశ్రమ నుంచి ముందుగా స్పందించింది కూడా ఈయనే. మృదుస్వభావిగా పేరున్న ఆయనను పెనమలూరి నుంచి బరిలోకి దించితే రాష్ట్ర వ్యాప్తంగా కృష్ణ, మహేష్‌బాబు అభిమానులు టీడీపీ పార్టీకి పని చేసే అవకాశముందని పార్టీ వర్గాలు భావిస్తున్నారు.
ప్రస్తుతం పెనమలూరు నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ ఉన్నారు. ఇప్పటీకే ఆయన పోటీకి సిద్ధం చేసుకున్నారు. క్షేత్రస్థాయిలో పర్యటనలు కూడా మొదలుపెట్టారు. మరోపక్క మైలవరం మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి దేవి ఉమామహేశ్వరరావు ఇక్కడి నుంచి పోటీ చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. మైలవరం సిటింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ టీడీపీ పార్టీలో చేరేందుకు దాదాపు రంగం సిద్ధమైంది. ఇలా ఇంతమంది ఈ స్థానం కోసం ట్రై చేస్తుంటే..వీరిని కాదని ఘట్టమనేని శేషగిరిరావు కు టికెట్ ఇస్తారా..? ఇస్తే వీరంతా సపోర్ట్ చేస్తారా..? అనేది చూడాలి.
Read Also : CM Revanth Visit Medaram : మేడారం వనదేవతలను దర్శించుకున్న సీఎం రేవంత్