AP DSC : ఫేక్ నోటిఫికేషన్ ఎన్నికల తాయిలం మాత్రమే – గంటా
- Author : Sudheer
Date : 07-02-2024 - 9:59 IST
Published By : Hashtagu Telugu Desk
ఏపీ నిరుద్యోగులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మెగా డీఎస్సీ (DSC) నోటిఫికేషన్ ను ఎట్టకేలకు ఏపీ సర్కార్ రిలీజ్ చేసింది. అది కూడా సరిగ్గా ఎన్నికలు రెండు నెలల్లో ఉండనున్న క్రమంలో నోటిఫికేషన్ రిలీజ్ చేసి ఎన్నికల వ్యూహాన్ని బయటపెట్టింది. అధికారంలోకి వచ్చాక ప్రతీ సంవత్సరం మెగా డీఎస్సీ (Mega DSC) అంటూ మాటలు చెప్పి ఓట్లు వేసుకున్న జగన్ (CM Jagan)..అధికారంలోకి వచ్చాక ఆ మాటలు మరచిపోయారు. గత నాలుగేళ్లుగా డీఎస్సీపై ఊసెత్తని ప్రభుత్వం..ఇక ఇప్పుడు డీఎస్సీ ప్రకటన చేసింది.
We’re now on WhatsApp. Click to Join.
ఈ ప్రకటన ఫై ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేయడం మొదలుపెట్టాయి. తాజాగా టిడిపి నేత గంటా శ్రీనివాస్ రావు స్పందిస్తూ.. ముఖ్యమంత్రి జగన్ చివరకు ఉద్యోగాల భర్తీని కూడా రాజకీయ ఎత్తుగడగా వాడుకుంటున్నారని విమర్శించారు. ‘అప్పుడు ఎన్నికలకు ముందు 25వేల పోస్టులతో DSC అని పదే పదే ఊదరగొట్టి.. 5ఏళ్ల తరువాత ఇప్పుడు 6,100 పోస్టులతో మమ అనిపించాలని చూస్తున్నారు. ఈ ఫేక్ నోటిఫికేషన్ ఎన్నికల తాయిలం మాత్రమే. అధికారంలోకి వచ్చాక అన్ని బ్యాక్లాగ్ పోస్టులను చంద్రబాబు భర్తీ చేస్తారు’ అని ట్వీట్ చేశారు.
ఇక ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్ చూస్తే..మొత్తం 6,100 టీచర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొంది. ఇందులో 2,299 స్కూల్ అసిస్టెంట్, 2,280 SGT పోస్టులు , 1,264 టీజీటీ, 215 పీజీటీ, 42 ప్రిన్సిపల్ పోస్టులు ఉన్నట్లు మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. ఫిబ్రవరి 12 నుంచి 22 వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకునేందుకు వెసులుబాటు కల్పించారు. మార్చి 05 నుంచి హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చు. మార్చి 15 నుంచి 30 వరకు డీఎస్సీ పరీక్షలు జరుగనున్నాయి.
మార్చి 31న ప్రాథమిక కీ విడుదల చేస్తారు. ఏప్రిల్ 02న ఫైనల్ కీ విడుదల చేసిన తరువాత.. ఏప్రిల్ 05 పరీక్షల ఫలితాలను వెల్లడించనున్నట్టు మంత్రి బొత్స సత్యానారాయణ తెలిపారు. తమ ప్రభుత్వంలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసి నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతోనే డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసినట్టు ఈ సందర్బంగా తెలిపారు.
ఇది మెగా డీఎస్సీ నా…?
దగా డీఎస్సీ నా…?చివరకు ఉద్యోగాల భర్తీని కూడా రాజకీయ ఎత్తుగడగా వాడుకుంటున్నారు..
ఎన్నికలకి ఆరు నెలలకి ముందు టెంకాయ కొడితే మోసం అని చెప్పిన జగన్ మోహన్ రెడ్డి గారు.. ఇప్పుడు ఎన్నికలకి 60 రోజుల ముందు టెంకాయలు కొడుతూ, డిఎస్సీ ఫేక్ నోటిఫికేషన్… pic.twitter.com/u0HoKNhVMR
— Ganta Srinivasa Rao (@Ganta_Srinivasa) February 7, 2024
Read Also : AP : జగనన్న పెద్ద పెద్ద కోటలు కట్టుకున్నాడు – షర్మిల