HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Gannavaram Ycp Candidate Change

Gannavaram : గ‌న్న‌వ‌రం వైసీపీ అభ్య‌ర్థిపై అధిష్టానం పునరాలోచ‌న‌.. అభ్య‌ర్థిని మార్చే ఛాన్స్‌..?

  • Author : Prasad Date : 20-02-2024 - 8:08 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ysrcp
Ysrcp

ఉమ్మ‌డి కృష్ణాజిల్లాలో కీల‌క నియోజ‌క‌వ‌ర్గ‌మైన గ‌న్న‌వ‌రంలో వైసీపీకి అభ్య‌ర్థులు క‌రువైయ్యారు. గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ నుంచి గెలిచిన వ‌ల్ల‌భ‌నేని వంశీమోహ‌న్ .. వైసీపీలోకి వెళ్లారు. అయితే వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న‌కు వైసీపీ అధిష్టానం గ‌న్న‌వ‌రం టికెట్ ఇచ్చేందుకు నిరాక‌రించింది. ఆయ‌న స్థానంలో కొత్త వారిని పోటీ చేయించాల‌ని అధిష్టానం భావిస్తుంది. ప్ర‌స్తుతం దుట్టా సీతారామ‌ల‌క్ష్మీని స‌మ‌న్వ‌య‌క‌ర్త‌గా నియ‌మించారు. అయితే ఆమెను కూడా మార్చి వేరే వారిని అభ్య‌ర్థిగా నిల‌పాల‌ని వైసీపీ చూస్తోంది. టీడీపీలో అసంతృప్తిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే ముద్ద‌ర‌బోయిన వెంక‌టేశ్వ‌ర‌రావును పార్టీలోకి ఆహ్వానించి గ‌న్న‌వ‌రం టికెట్ ఇచ్చేందుకు వైసీపీ సిద్ధ‌మైంది. నూజివీడులో టీడీపీ అభ్య‌ర్థిగా కొలుసు పార్థ‌సారథి పోటీ చేస్తుండ‌టంతో ముద్ద‌ర‌బోయిన అసంతృప్తిగా ఉన్నారు. దీంతో వైసీపీ నేత‌లు ముద్ద‌ర‌బోయిన‌కు గాలం వేశారు. గ‌న్న‌వ‌రం టికెట్ ఇస్తామంటూ ఆయ‌నతో ట‌చ్‌లోకి వెళ్లారు. ముద్ద‌ర‌బోయిన వెంక‌టేశ్వ‌ర‌రావు గ‌తంలో గ‌న్న‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గం నుంచి స్వ‌తంత్ర అభ్య‌ర్థిగా పోటీ చేసి గెలిచారు. దీంతో ఇక్క‌డ ఆయ‌న‌కు గెలుపు అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయ‌నే భావ‌న‌తో వైసీపీ ఆయ‌న్ని బ‌రిలోకి దించ‌బోతుంది. గ‌న్న‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గంలో యాద‌వ సామాజిక‌వ‌ర్గం ఎక్కువ‌గా ఉండ‌టంతో ముద్ద‌ర‌బోయిన‌కు క‌లిసి వ‌స్తుంది.

We’re now on WhatsApp. Click to Join.

ఇప్ప‌టికే ముద్ద‌ర‌బోయిన వెంక‌టేశ్వ‌ర‌రావు సీఎంవో కార్యాల‌యంలో ప్ర‌భుత్వ స‌ల‌హాదారుడు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి, ధ‌నుంజ‌య‌రెడ్డిల‌ను క‌లిసిన‌ట్లు స‌మాచారం.టికెట్‌పై ఆయ‌న‌కు స్పష్ట‌త ఇచ్చార‌ని.. త్వ‌ర‌లోనే ఆయ‌న వైసీపీలో చేరి గ‌న్న‌వ‌రంలో ప్ర‌చారం ప్రారంభిస్తార‌ని ముద్ద‌ర‌బోయిన స‌న్నిహితులు తెలిపారు. ఇదే సీటు కోసం ఎప్ప‌టి నుంచో చూస్తున్న దుట్టా రామ‌చంద్ర‌రావు ఫ్యామిలీకి మ‌రోసారి నిరాశే మిగిలేలా క‌నిపిస్తుంది. 2019లో దుట్టా రామ‌చంద్రారావు స్థానంలో యార్ల‌గ‌డ్డ వెంక‌ట్రావు వ‌చ్చి పోటీ చేసి ఓడిపోయారు. అయితే వీరిద్ద‌రు సిట్టింగ్ ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీపై పోరాడారు. చివ‌రికి యార్ల‌గ‌డ్డ టీడీపీలో చేర‌డం, వంశీకి వైసీపీలో టికెట్ నిరాక‌రించ‌డంతో దుట్టా ఫ్యామిలీకి లైన్ క్లియ‌ర్ అయింది. దుట్టా సీతారామ‌ల‌క్ష్మీని స‌మ‌న్వ‌య‌క‌ర్త‌గా నియ‌మించారు. అయితే ఇంత‌లోనే ముద్ద‌ర‌బోయిన వైసీపీలో చేరేందుకు రెఢీ అవ్వ‌డంతో గ‌న్న‌వ‌రంలో దుట్టా ఫ్యామిలీకి మ‌ళ్లీ ఎదురుదెబ్బ త‌గిలింది.దీంతో దుట్టా ఫ్యామిలీ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.

Also Read:  Balka Suman: 15 రోజుల్లో నలుగురు గురుకుల విద్యార్థినిలు ఆత్మహత్యలు చేసుకున్నారు: బాల్క సుమన్


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • cm jagan
  • gannavaram
  • tdp
  • ysrcp

Related News

Adulterated milk incident.. Rs. 10 lakhs to the families of the deceased: CM Chandrababu

కల్తీ పాల ఘటన .. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు : సీఎం చంద్రబాబు

మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం ప్రకటిస్తూ.. ప్రభుత్వం తరఫున ప్రతి కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు.  ప్రాథమిక నివేదికల ప్రకారం ఈ విషాదానికి కారణం వరలక్ష్మి డెయిరీ నుంచి వచ్చిన కల్తీ పాలు అని గుర్తించబడింది.

  • Ambati Rambabu

    అంబటి రాంబాబు అనే కుక్కకీ ఒక రోజొస్తుంది

  • Ap Legislative Council

    మండలిలో కొత్త రచ్చ.. దేవుడి చిత్రాలతో వైసీపీ రాజకీయం

  • Atchannaidu Vs Botsa Satyanarayana

    బొత్స సత్యనారాయణ కు ఇచ్చిపడేసిన అచ్చెన్నాయుడు.. అచ్చం VS బొత్స

Latest News

  • తెలంగాణలో మూడు కొత్త శాఖలను ప్రారంభిన ఎస్‌బీఐ లైఫ్

  • తన పేరుతో ఏర్పడిన సంస్థలపై కేటీఆర్ స్పష్టీకరణ

  • జుట్టుకు పెరుగు అప్లై చేయడం వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలివే!!

  • తిరుమల కోసం స్వర్ణ దేవాలయం తరహా ప్రత్యేక చట్టం? .. యోచనలో ఏపీ ప్రభుత్వ

  • రోడ్డుపై తెల్లటి గీతలు.. ఎందుకు ఉంటాయో తెలుసా?!

Trending News

    • పీఎం కిసాన్ 22వ విడత.. ఈ వారమే రూ. 2000 వచ్చే అవకాశం?

    • బంగారం, వెండి ధరల పై నిర్మలా సీతారామన్ ఆసక్తికర వ్యాఖ్యలు

    • ఆకాశాన్నంటుతున్న బంగారం, వెండి ధరలు!

    • సౌతాఫ్రికాతో మ్యాచ్‌.. బుమ్రా స‌రికొత్త రికార్డు!

    • టీ20 వరల్డ్ కప్ 2026.. సెమీఫైనల్, ఫైనల్ వేదికలపై ఇంకా వీడని సందిగ్ధత!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd