Ganesh Mandapam : గణేష్ మండపంలో శివుడి మేడలో ప్రత్యక్షమైన నాగుపాము..భక్తి పరవశంలో భక్తులు
శివపార్వతుల విగ్రహాలను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ఓ నాగుపాము శివుడి మెడలో ప్రత్యక్షమై మెడకు చుట్టుకొని బుసలు కొట్టడం ప్రారంభించింది
- Author : Sudheer
Date : 21-09-2023 - 7:26 IST
Published By : Hashtagu Telugu Desk
వినాయకచవితి సందర్బంగా దేశ వ్యాప్తంగా వినాయకచవితి (vinayaka chavithi) ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఊరు , వాడ, పల్లె , పట్టణం అనే తేడాలు లేకుండా లక్షలాది గణనాథుల మండపాల్లో పూజలు నివహిస్తు భక్తులు తమ భక్తిని చాటుకుంటున్నారు. ఈ క్రమంలో గణేష్ మండపంలో ఉన్న శివుడి విగ్రహం మేడలో నాగుపాము ప్రత్యేక్షమయ్యింది. ఈ ఘటన విజయనగరంలో చోటుచేసుకుంది.
వైయస్సార్ నగర్ కాలనీలో గణేష్ మండపం (Ganesh Mandapam)లో శివపార్వతుల విగ్రహాలను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ఓ నాగుపాము (Snake) శివుడి మెడలో ప్రత్యక్షమై మెడకు చుట్టుకొని బుసలు కొట్టడం ప్రారంభించింది. దీనిని చూసి భక్తులు భక్తి పరవంశంలో మునిగిపోయారు. దూరంగా నిల్చుని నాగుపామును మొక్కడం చేశారు. ఇది కచ్చితంగా దైవనిర్ణయమే అని కొందరూ అంటుంటే అది యాదృశ్చికం అని మరి కొందరు అంటున్నారు. కాసేపటి తర్వాత నిర్వాహకులు స్నేక్ క్యాచర్‌కి సమాచారం ఇచ్చారు. దీంతో అతడు వచ్చి పామును పట్టుకొని అటవీ ప్రాంతంలో వదిలేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Read Also: Vijayashanthi : సొంత పార్టీ నేతలే నాపై తప్పుడు ప్రచారం చేయిస్తున్నారు.. రాములమ్మ..