RK Roja: రోజాకు వింత అనుభవం!
పర్యాటక శాఖ మంత్రి ఆర్.కె. రోజా తన అసెంబ్లీ నియోజకవర్గంలో గడప గడపకూ కార్యక్రమంలో పాల్గొన్నారు.
- By Balu J Published Date - 05:48 PM, Mon - 16 May 22

పర్యాటక శాఖ మంత్రి ఆర్.కె. రోజా తన అసెంబ్లీ నియోజకవర్గంలో గడప గడపకూ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజలతో మమేకమై సామాజిక సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. రోజా మంత్రి అయిన తర్వాత తొలిసారిగా వచ్చిన ఆమెను కొన్ని ప్రాంతాల్లో మహిళలు ఘనంగా సత్కరించారు. అయితే.. ఓ వృద్ధుడితో మాట్లాడింది. పింఛన్ వస్తుందా? లేదా అని అడిగినప్పుడు.. తనకు నెలనెలా పింఛన్ వస్తోందని, అయితే తాను ఒంటరిగా ఉన్నందున తనకు పెళ్లికూతురును చూడాలని రోజాను కోరాడు. ఆయన విన్నపం విన్న మంత్రి నవ్వుతూ.. పింఛను ఇస్తారేమో కానీ.. పెళ్లికూతురు కాదు అంటూ సమాధానం ఇచ్చింది. సోమవారం పుత్తూరు రూరల్ మండలం గోపాలకృష్ణాపురంలో నూతనంగా నిర్మించిన సచివాలయాన్ని రోజా ప్రారంభించి వైఎస్‌ఆర్ రైతు భరోసా కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రభుత్వ విప్, తుడా చైర్మన్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటరమణారెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Related News

CM Jagan’s Daughter: మాస్టర్స్‌లో డిస్టింక్షన్‌తో పాసైన సీఎం జగన్ కూతురు హర్షిణి రెడ్డి.. ట్వీట్ వైరల్!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల సమయంలో ఇచ్చిన ఒక్కొక్క హామీలను నెరవేరుస్తూ ప్రజల కోసం ఎన్నో పథకాలను అమల్లోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే.