HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Future Of Capital Amaravathi Not Known

Amaravathi : అమ‌రావ‌తికి అదీ పాయే.!

రాజధాని అమరావతిని, పక్కనే ఉన్న విజయవాడ, గుంటూరు నగరాల్ని, మంగళగిరి, తాడేపల్లి వంటి పట్టణాల్ని కలిపి ఒక మహా నగరంగా అభివృద్ధి చేసేందుకు గతంలో ప్రణాళికలు సిద్ధమయ్యాయి.వాటితో పాటు, చుట్టుపక్కల ఉన్న మరిన్ని ప్రాంతాల్నీ ఒక బృహత్‌ అభివృద్ధి నడవాగా చేసేందుకు 189 కి.మీ.ల పొడవైన ఓఆర్‌ఆర్‌ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం, జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ కలసి ప్రణాళికలు సిద్ధం చేశాయి

  • Author : CS Rao Date : 21-12-2021 - 2:12 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt

రాజధాని అమరావతిని, పక్కనే ఉన్న విజయవాడ, గుంటూరు నగరాల్ని, మంగళగిరి, తాడేపల్లి వంటి పట్టణాల్ని కలిపి ఒక మహా నగరంగా అభివృద్ధి చేసేందుకు గతంలో ప్రణాళికలు సిద్ధమయ్యాయి.వాటితో పాటు, చుట్టుపక్కల ఉన్న మరిన్ని ప్రాంతాల్నీ ఒక బృహత్‌ అభివృద్ధి నడవాగా చేసేందుకు 189 కి.మీ.ల పొడవైన ఓఆర్‌ఆర్‌ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం, జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ కలసి ప్రణాళికలు సిద్ధం చేశాయి.నిర్మాణ వ్యయాన్ని భరించేందుకు కేంద్రం అంగీకరించింది. సవివర ప్రాజెక్టు నివేదికా సిద్ధమైంది. అవసరమైన భూములను సమీకరించి, నిర్మాణం మొదలు పెట్టడమే తరువాయి… రాజధాని అమరావతి నిర్మాణ పనులతో పాటు, ఓఆర్‌ఆర్‌ ప్రాజెక్టునూ అటకెక్కించిన రాష్ట్ర ప్రభుత్వం.. ఇప్పుడు ఏకంగా ఆ ప్రాజెక్టే వద్దని కేంద్రానికి చెప్పేసింది. ఆ విషయాన్ని కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ రాజ్యసభలో స్పష్టంచేయ‌డం చ‌ర్చ‌నీయాంశం అయింది.

అమ‌రావ‌తి ఔట‌ర్ రింగ్ రోడ్డులోని అంశాలివి..
★ ఓఆర్‌ఆర్‌కి బదులుగా.. 78 కి.మీ.ల విజయవాడ తూర్పు బైపాస్‌ రోడ్డు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరినట్టు పేర్కొన్నారు.

★ అమరావతి ఓఆర్‌ఆర్‌ నిర్మాణం పూర్తయితే ఈ ప్రాంత ముఖచిత్రమే మారిపోతుంది.

★ కృష్ణా, గుంటూరు జిల్లాలకే కాదు, రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికీ ఈ రింగురోడ్డు దోహదం చేస్తుంది.

★ రింగురోడ్డుకు లోపలున్న ప్రాంతంతో పాటు, వెలుపల చుట్టూ కొన్ని కి.మీ.ల దూరం అభివృద్ధి పరుగులు పెడుతుంది.

★ ఓఆర్‌ఆర్‌కి వెలుపల, సమీపంలో ఉన్న చిన్న పట్టణాలు, ముఖ్యమైన పట్టణ కేంద్రాలకు ఓఆర్‌ఆర్‌తో అనుసంధానం పెరిగి ప్రత్యేక ‘డెవలప్‌మెంట్‌ నోడ్స్‌’గా మారతాయి. ఈ ప్రాంతం మీదుగా వెళ్లే జాతీయ, రాష్ట్ర రహదారుల్ని కలుపుతూ ఓఆర్‌ఆర్‌ నిర్మించడం వల్ల రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు, పొరుగు రాష్ట్రాలకు అమరావతితో అనుసంధానత పెరుగుతుంది.

★ రాష్ట్రానికి అమరావతిని ఏకైక రాజధానిగా చేయడం ప్రభుత్వానికి ఇష్టం లేదనుకున్నా… ఈ ప్రాంతాన్నీ అభివృద్ధి చేయాల్సిందే కదా.

★ మరోపక్క అమరావతిని శాసన రాజధానిగా అభివృద్ధి చేస్తామనీ సర్కారు అంటోంది.

★ అమరావతిని నగరపాలక సంస్థగా చేసే ఆలోచనా ఉన్నట్టు తెలుస్తోంది.

★ విజయవాడ-గుంటూరు మధ్య జాతీయ రహదారికి అటూఇటూ ఇప్పటికే భారీ నివాస, వాణిజ్య సముదాయాలు వచ్చాయి.

★ ఈ రెండు ప్రాంతాలూ త్వరలోనే కలసిపోయే అవకాశమూ ఉంది.

★ అలాంటప్పుడు… ఈ ప్రాంత అభివృద్ధికి ఓఆర్‌ఆర్‌ అవసరమే కదా?

★ ప్రభుత్వం దాన్నెందుకు కాదంటోంది? అనే విమర్శలు వినిపిస్తున్నాయి.

పొరుగు రాష్ట్రాన్ని చూసైనా నేర్చుకోరా?

★ ప్రపంచంలోని పలు మహా నగరాలు వేగంగా అభివృద్ధి చెందడంలో, విస్తరించడంలో అవుటర్‌ రింగ్‌ రోడ్ల పాత్ర కీలకం.
అమరావతి ఓఆర్‌ఆర్‌ ప్రతిపాదన ఇదీ..

★ కృష్ణా, గుంటూరు జిల్లాల్లో సీఆర్‌డీఏ పరిధిలో రాజధాని అమరావతి, విజయవాడ, గుంటూరు నగరాల చుట్టూ 189 కి.మీ.ల మేర నిర్మాణం.

★ నిర్మాణ వ్యయం (2018 జనవరి అంచనాల ప్రకారం) రూ.17,761.49 కోట్లు. ‘ఔటర్‌ రింగ్‌ రోడ్‌ ఫర్‌ న్యూ కేపిటల్‌ సిటీ’- అని దీనికి కేంద్ర ఉపరితల రవాణాశాఖ పేరు పెట్టింది. కృష్ణా, గుంటూరు జిల్లాల పరిధిలో 87 గ్రామాల మీదుగా ఈ రహదారి వెళుతుంది.

★ ఓఆర్‌ఆర్‌కి పూర్తిగా లోపల ఉన్న, ఓఆర్‌ఆర్‌ వెళుతున్న మండలాలు 40 కాగా… జనాభా 36.13 లక్షలు.

★ అమరావతి, విజయవాడ, గుంటూరు నగరాల చుట్టూ 189 కి.మీ.ల మేర అవుటర్‌ రింగ్‌ రోడ్డు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించాక, డీపీఆర్‌ సిద్ధమయ్యాక… మాకు రింగురోడ్డు వద్దేవద్దు, విజయవాడకు 78 కి.మీ.ల బైపాస్‌ రోడ్డు ఇవ్వండి చాలని అడగటం విజ్ఞతేనా?

★ దేశ, విదేశాల్లో నగరాలు శరవేగంగా అభివృద్ధి చెందడానికి అవుటర్‌ రింగ్‌రోడ్లు ఎలా దోహదం చేస్తున్నాయో రాష్ట్ర ప్రభుత్వానికి తెలీదా?

★ హైదరాబాద్‌ చుట్టూ అవుటర్‌ రింగ్‌రోడ్డు నిర్మించాక… పది పన్నెండేళ్లలోనే అభివృద్ధి శరవేగంగా ఎలా పరుగులు తీసిందో కనిపించడం లేదా?

★ హైదరాబాద్‌ చుట్టూ 158 కి.మీ.ల పొడవైన ఓఆర్‌ఆర్‌ ఉండగానే… దానికి వెలుపల సుమారు 340 కి.మీ.ల పొడవున ప్రాంతీయ రింగు రోడ్డు(ఆర్‌ఆర్‌ఆర్‌)ను తెలంగాణ ప్రభుత్వం నిర్మించబోతున్న విషయం మన పాలకులకు తెలియదా?

★ అన్నీ తెలిసీ… అమరావతి ఓఆర్‌ఆర్‌కి మంగళం పాడాలని ప్రభుత్వం ఎందుకు నిర్ణయించింది? ప్రభుత్వమే అభివృద్ధికి ఎందుకు మోకాలడ్డుతోంది? ఇవి ఇప్పుడు రాష్ట్ర ప్రజల్ని, విజ్ఞుల్ని వేధిస్తున్న ప్రశ్నలు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 3 capitals
  • amaravathi
  • ap capital

Related News

amaravati farmers land allotment

Amaravati : ఇకపై అమరావతి స్పెల్లింగ్‌ అలాగే రాయాలి – అధికారులకు ఏపీ సర్కార్ ఆదేశాలు..!!

ఇకపై అధికారికంగా 'Amaravati' అనే స్పెల్లింగ్‌ను మాత్రమే వాడాలని స్పష్టం చేసింది. గతంలో కొంతమంది 'Amaravathi' అని, మరికొందరు 'Amaravati' అని వేర్వేరుగా రాస్తుండటంతో అధికారిక ఉత్తర్వులు, ఫైళ్లు మరియు గెజిట్‌లలో గందరగోళం నెలకొనేది

  • Amaravati

    Amaravati: అమరావతి పేరు మార్పు.. ప్రభుత్వం కీలక ఆదేశాలు.

Latest News

  • ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ మూవీ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ప్ర‌క‌ట‌న‌!

  • ఎంత నీరు తాగినా ఇంకా దాహమేస్తోందా?

  • ఐసీయూలో మాజీ క్రికెటర్.. ప్రాణాంతక వ్యాధితో పోరాటం!

  • పాత ఉద్యోగం పోయె.. కొత్త ఆఫర్ వెనక్కి తీసుకెళ్లె! సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆవేదన

  • యాపిల్ కొత్త సీఈఓగా జాన్ టెర్నస్.. ఎవ‌రీత‌ను?

Trending News

    • మారుతున్న శాలరీ స్ట్రక్చర్.. ఎవరికి లాభం? ఎవరికి నష్టం?

    • రేపు బ్యాంకుల‌కు సెల‌వు ఉందా?

    • వేసవిలో ఏసీలు ఎందుకు పేలుతాయి?

    • అమెరికా-ఇరాన్ చర్చలకు నో చెప్పిన టెహ్రాన్‌.. ఇస్లామాబాద్‌లో మాత్రం లాక్‌డౌన్!

    • రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి పెరగనున్న కష్టాలు!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd