Tiger Cubs Shifted: ఆపరేషన్ మదర్ ఫెయిల్.. తిరుపతి పార్క్ కు పులి పిల్లలు!
అటవీ శాఖ అధికారులు నాలుగు రోజులుగా పిల్లలను తల్లి వద్దకు చేర్చేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి.
- By Balu J Published Date - 10:20 AM, Fri - 10 March 23

నంద్యాల జిల్లా ఆత్మకూర్ అటవీశాఖ కార్యాలయంలో ఉంచిన పులి పిల్లల (Tiger Cubs) ను గురువారం రాత్రి 10.30 గంటలకు ప్రత్యేక వాహనంలో తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర జూలాజికల్ పార్కుకు తరలించారు. ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఆదేశాల మేరకు ఈ చర్యలు తీసుకున్నట్లు నాగార్జున సాగర్-శ్రీశైలం ఫీల్డ్ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి తెలిపారు. ‘అటవీ శాఖ అధికారులు నాలుగు రోజులుగా పిల్లలను తల్లి వద్దకు చేర్చేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. దీంతో పులి పిల్లల (Tiger Cubs) సంరక్షణను దృష్టిలో ఉంచుకుని తిరుపతి జూ పార్కుకు తరలించాం’’ అని తెలిపారు.
నెల్లూరు కలెక్టర్ ప్రకటన నాగార్జునసాగర్-శ్రీశైలం ఫీల్డ్ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. తల్లి పులి బతికే ఉందని, పిల్లలు (Tiger Cubs) కూడా ఆరోగ్యంగా, చురుగ్గా ఉన్నాయని తెలిపారు. తిరుపతిలోని జూకు అనుబంధంగా ఉన్న అడవిలో పులి పిల్లలను పెంచుతామని.. నిర్దిష్ట వయస్సు రాగానే శిక్షణ ఇచ్చి అడవుల్లోకి వదిలేస్తామని చెప్పారు. ఇదిలా ఉండగా, గురువారం ఉదయం పులి పాదముద్రలు కనిపించాయని, పులి పిల్లలను అక్కడికి తరలించామని, కూనల అరుపులతో రికార్డింగ్‌లు వింటూ తెల్లవారుజాము వరకు వేచిచూసినా తల్లి (Mother) పులి జాడ కనిపించలేదని కొందరు తెలిపారు.

Related News

TDP Mahanadu: రాజమండ్రిలో టీడీపీ మహానాడు
పార్టీలోకి 40 మంది ఎమ్మెల్యేలు వైసీపీ నుంచి రానున్నారని మాట్లాడిన ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు.