Accident : గుంటూరు జిల్లాలో ఘోరరోడ్డు ప్రమాదం…నలుగురు విద్యార్థులు దుర్మరణం..!!
గుంటూరు జిల్లాలో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు విద్యార్థులు దుర్మరణం చెందారు. రోడ్డుపై ఆగి ఉన్న లారీని కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.
- By hashtagu Published Date - 10:55 PM, Mon - 15 August 22

గుంటూరు జిల్లాలో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు విద్యార్థులు దుర్మరణం చెందారు. రోడ్డుపై ఆగి ఉన్న లారీని కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటన ప్రత్తిపాడు మండలం తుమ్మలపాలెం దగ్గర జరిగింది. విద్యార్థులు కారులో విజయవాడ నుంచి చిలకలూరిపేట వైపు వస్తుండగా ఈ ఘోరం జరిగింది. గౌతమ్ రెడ్డి, చైతన్య పవన్, సౌమ్యిక అక్కడిక్కడే మరణించగా…మరొకరు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో ప్రాణాలు విడిచినట్లు సమాచారం. వీరిందరూ ఆర్కిటెక్చర్ విద్యార్థులని పోలీసులు వెల్లడించారు. ప్రమాదానికి కారు వేగమే ముఖ్య కారణమని పోలీసులు భావిస్తున్నారు. కారు ముందు భాగం లారీ కిందకు దూసుకెళ్లింది. కారు పూర్తిగా నుజ్జునుజ్జుగా మారింది.