TTD Regulations : టీటీడీ నిబంధనలు ఉల్లంఘించిన మాజీ మంత్రి అంబటి రాంబాబు
TTD Rules : అంబటి తన షర్ట్‌పై జగన్ ఫొటో ఉన్న స్టిక్కర్‌తో రావడం అనేది ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది
- Author : Sudheer
Date : 04-11-2024 - 2:13 IST
Published By : Hashtagu Telugu Desk
వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu)..టీటీడీ నిబంధనలు (TTD Regulations) ఉల్లఘించి వార్తల్లో నిలిచారు. నేడు సోమవారం ఆయన తిరుమల శ్రీవారిని (Tirumala Srivari)దర్శించుకున్నారు. ఈ క్రమంలో ఆయన జగన్ ఫోటో ఉన్న స్టికర్ ను వేసుకున్న షర్ట్ వేసుకొని దర్శనం చేసుకున్నారు.
దీనిపై ఇప్పుడు పెద్ద చర్చ నడుస్తుంది.రాజకీయ పార్టీల జెండాలు, చిహ్నాలు, స్టిక్కర్లతో స్వామివారి దర్శనానికి రావడం టీటీడీ నిబంధనలకు విరుద్ధం. అయినా అంబటి తన షర్ట్‌పై జగన్ ఫొటో ఉన్న స్టిక్కర్‌తో రావడం అనేది ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. మరి దీనిపై టీటీడీ ఎలాంటి యాక్షన్ తీసుకుంటుందో ..వాటికీ రాంబాబు చెప్పే సమాదానాలు ఎలా ఉంటాయో అనేది ఆసక్తి గా మారింది.
ప్రస్తుతం ఏపీలో కూటమి vs వైసీపీ వార్ నడుస్తుంది. తాజాగా సీఎం చంద్రబాబు రుషికొండ ప్యాలస్ ను సందర్శించడంఫై రాంబాబు పలు కీలక వ్యాఖ్యలు , సవాళ్లు విసరడం జరిగింది. రుషికొండ ( Rushikonda) లో ప్రభుత్వ భవనాలను నిర్మిస్తే విలాస భవనాలు అంటూ చంద్రబాబు విష ప్రచారం చేస్తున్నారని అంబటి రాంబాబు (Ambati Rambabu) విమర్శించారు. రుషికొండ భవనాలను చూసి చంద్రబాబు (Chandra Babu) ఆశ్చర్య పడుతున్నారని, అమరావతిలో అలాంటి భవనాన్ని కట్టలేని చంద్రబాబు సిగ్గుపడాలని ఆరోపించారు. కట్టిన వాటిని కూల్చివేసే దమ్ముందా అంటూ ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వానికి శరవేగంగా వ్యతిరేకత పెరుగుతుందని, ఎన్నికలు ఏ క్షణాన వచ్చిన వైసీపీ విజయం తథ్యమని ధీమాను వ్యక్తం చేశారు. వైసీపీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని అన్నారు. రెడ్‌బుక్‌కు ఎవరూ కూడా భయపడరని అంటూ కీలక వ్యాఖ్యలు చేసారు.
Read Also : Jammu Kashmir : ఆరేళ్ల తర్వాత తొలి సెషన్.. రసాభాసగా కశ్మీర్ అసెంబ్లీ సమావేశం