HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Floods Effect Wings For Chicken Prices In Andhra Pradesh

Chicken Prices : చికెన్, ఉల్లి, టమాటా ధరలకు రెక్కలు.. సామాన్యుల బెంబేలు

కేవలం నాలుగు వారాల వ్యవధిలోనే సీన్ మారిపోయింది. చికెన్ రేట్లు పెరిగిపోయి కిలోకు 270 రూపాయలకు(Chicken Prices)  చేరాయి.

  • Author : Pasha Date : 29-09-2024 - 3:34 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Chicken Price Hike

Chicken Prices : ఆంధ్రప్రదేశ్‌లో చికెన్ రేట్లు రెక్కలు తొడిగాయి. ప్రస్తుతం రీటైల్ మార్కెట్‌లో చికెన్ రేట్లు కేజీకి రూ.270 దాకా పలుకుతున్నాయి. దీంతో చికెన్ అమ్మకాలు బాగా తగ్గిపోయాయి. దసరా నవరాత్రులు ప్రారంభమయ్యాక చికెన్ వినియోగం తగ్గుతుంది. అందువల్ల ఆ టైంలో రేట్లు కొంతమేర దిగి వస్తాయనే ఆశాభావం వ్యక్తమవుతోంది. వాస్తవానికి సెప్టెంబరు నెల ప్రారంభంలో కిలో చికెన్ ధర రూ.200 వరకే ఉంది. ఏపీలోని కొన్ని  ప్రాంతాల్లోనైతే కిలో చికెన్‌ను రూ.160కే విక్రయించారు. శ్రావణ మాసం, వినాయక చవితి ఉండటంతో ధర అప్పట్లో లో రేంజులో ఉండిపోయింది. వినాయక చవితి ముగియగానే అమాంతం చికెన్ సేల్స్ పెరిగిపోయాయి. పండగ సీజన్ కూడా సమీపించింది. దీంతో ధరలు క్రమంగా పెరుగుతూపోయాయి. కేవలం నాలుగు వారాల వ్యవధిలోనే సీన్ మారిపోయింది. చికెన్ రేట్లు పెరిగిపోయి కిలోకు 270 రూపాయలకు(Chicken Prices)  చేరాయి.

Also Read :Pull Ups On Signboard : రీల్స్ పిచ్చి.. హైవే సైన్‌బోర్డు‌పై పుల్ అప్స్.. ఏమైందంటే.. ?

మరోవైపు ఉల్లి, వెల్లుల్లి ధరలు కూడా మండిపోతున్నాయి. కిలో ఉల్లి ధర  రూ.70 దాకా పలుకుతోంది. వాస్తవానికి మూడు వారాల కిందటి వరకు కిలో ఉల్లి ధర కేవలం రూ.40 దరిదాపుల్లోనే ఉంది. కేంద్ర ప్రభుత్వం ఉల్లి ఎగుమతి సుంకాన్ని ఎత్తేయడంతో ఒక్కసారి ఉల్లి ధర రాకెట్ వేగాన్ని పొందింది. ఈ పరిణామంతో ఉల్లి ధర దాదాపు రెట్టింపై కేజీకి రూ.70 రేంజుకు చేరుకుంది. దీంతో ఉల్లి ధరను కంట్రోల్‌లోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. నాఫేడ్ ద్వారా కిలో ఉల్లిని రూ.35కే విక్రయిస్తోంది. రైతు బజార్, మార్కెట్ల వద్ద ఉల్లిని తక్కువ రేటుకు అమ్ముతున్నారు. అయితే ఒక వ్యక్తికి ఒక కిలో మాత్రమే అమ్ముతున్నారు. టమాటా రేట్లు కూడా మండిపోతున్నాయి. కిలో టమాటా  ధర రూ.60 దాకా ఉంది. మిగతా కూరగాయలన్నీ కిలోకు రూ.50కిపైనే ఉండటం సామాన్యులకు ఇబ్బంది కలిగిస్తోంది. క్యాప్సికమ్ కిలోకు రూ. 80, బీన్స్ కిలోకు రూ.80, బీరకాయ కిలోకు రూ.60, గోరు చిక్కుడు కిలోకు రూ.60 వరకు ధర పలుకుతున్నాయి. కోడిగుడ్డు ధర రిటైల్ షాపుల్లో  ఒకటి రూ.6 పలుకుతోంది.

Also Read :Iran Spy : హిజ్బుల్లా చీఫ్‌ను ఎలా చంపారు ? హసన్ నస్రల్లా ఆచూకీ చెప్పింది అతడే ?


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • ap
  • Chicken Prices
  • Egg Prices
  • Floods Effect
  • vegetables prices

Related News

INS Mahendragiri joins the Indian Navy.

INS Mahendragiri: భారత నౌకాదళంలో చేరిన ఐఎన్‌ఎస్ మహేంద్రగిరి

రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ విశాఖపట్నం డాక్‌యార్డ్‌లో యుద్ధనౌకను ప్రారంభించారు. ప్రాజెక్ట్ 17A నీలగిరి-క్లాస్ ప్రోగ్రామ్ కింద ఆరవ నౌక అయిన, స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన స్టెల్త్ ఫ్రిగేట్ ఐఎన్ఎస్ మహేంద్రగిరిని ప్రారంభించడంతో భారత నౌకాదళం శనివారం తన నౌకాదళాన్ని బలోపేతం చేసుకుంది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ విశాఖపట్నం డాక్‌యార్డ్‌లో ఈ యుద్ధనౌకను ప్రారంభించారు

  • State-of-the-art showroom 'Elite Eco Energy' inaugurated in Bhimavaram.

    Elite Eco Energies: భీమవరంలో అత్యాధునిక షోరూమ్ ‘ఎలైట్ ఎకో ఎనర్జీస్’ ప్రారంభం

  • Complaint filed against actor Prakash Raj at the police station.

    Prakash Raj: నటుడు ప్రకాష్ రాజ్ పై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు

  • Vip Break Darshan For 116 Y

    TTD : 116 ఏళ్ల భక్తికి టీటీడీ గౌరవం .. నవనీతమ్మకు వీఐపీ బ్రేక్ దర్శనం : బీఆర్‌ నాయుడు

  • Big shock for YouTuber Ravan

    YouTuber Ravan : యూట్యూబర్‌ రావణ్‌పై ‘ఉపా’ చట్టం కింద కేసు నమోదు

Latest News

  • Vastu Tips: ఇంట్లో అరటి చెట్టు నాటితే అశుభమా..? శాస్త్రం ఏం చెబుతోంది..!!

  • Cigarette Alert: ఇప్పుడు బాక్స్‌పై కాదు, ప్రతి సిగరెట్‌పై హెచ్చరిక.. ఎక్కడంటే?

  • Harish Rao: బీజేపీతో టచ్‍లో హరీశ్ రావు : రేవంత్ రెడ్డి

  • True Love: ఒక వ్యక్తికి మీ మీద నిజంగా ప్రేమ ఉందో లేదో ఇలా తెలుసుకోవచ్చు!

  • Donald Trump: ముంచుకొస్తున్న డెడ్‌లైన్.. ఇరాన్‎కు ట్రంప్ మాస్ వార్నింగ్

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd