Floating Bridge : వైజాగ్ బీచ్‌లో ‘ఫ్లోటింగ్ బ్రిడ్జ్’.. ప్రత్యేకతలు ఇవిగో
Floating Bridge : ఫ్లోటింగ్ బ్రిడ్జ్‌పై విహారం ఎంతో ఆనందాన్ని అందిస్తుంది.
- Author : Pasha
Date : 18-02-2024 - 1:15 IST
Published By : Hashtagu Telugu Desk
Floating Bridge : ఫ్లోటింగ్ బ్రిడ్జ్‌పై విహారం ఎంతో ఆనందాన్ని అందిస్తుంది. ఇలాంటి ఫ్లోటింగ్ బ్రిడ్జ్ తొలి సారిగా ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో ఉన్న ఆర్కే బీచ్‌లో అందుబాటులోకి వచ్చింది. తెన్నేటి పార్క్ సమీపంలో ఈ బ్రిడ్జ్‌ను ఏర్పాటు చేశారు. కేరళలోని చవక్కడ్ బీచ్‌లో ఉన్న ఫ్లోటింగ్ బ్రిడ్జ్ స్ఫూర్తితో విశాఖలోనూ ఈ తేలియాడే వంతెనను ఏర్పాటు చేశారు.
We’re now on WhatsApp. Click to Join
వైజాగ్‌కు వచ్చే పర్యాటకులకు ఫ్లోటింగ్ బ్రిడ్జ్ సరికొత్త ఆకర్షణగా నిలువనుంది. దీని మీదుగా నడుస్తూ సముద్రంలో 100 అడుగుల దూరందాకా వెళ్లొచ్చు. దీని చివర్లో ఉన్న వ్యూపాయింట్ మీద నిలబడి సముద్రం అందాలను మరింతగా ఎంజాయ్ చేయొచ్చు. అలల ఒత్తిడి వల్ల పర్యాటకులు సముద్రంలో పడిపోయే రిస్క్ ఉండటంతో.. ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జికి రెండు వైపులా 34 సిమెంట్ దిమ్మెలతోపాటు అడ్డంగా రెండు ఐరన్ యాంకర్లను ఏర్పాటు చేశారు. బ్రిడ్జిపై ప్రతి 25 మీటర్లకూ లైఫ్ గార్డ్స్‌ను ఏర్పాటు చేశారు. దీనికి ఇరువైపులా రెండు లైఫ్ బోట్లను రెడీగా ఉంచుతారు.
Also Read : Jharkhand Crisis : జార్ఖండ్‌లో ‘జైపూర్’ దడ.. రాజకీయం ‘హస్త’వ్యస్తం!
ఈ తేలియాడే వంతెనపైకి(Floating Bridge) ఒకేసారి 200 మంది టూరిస్టులు వెళ్లొచ్చు. అధికార యంత్రాంగం నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే.. ఫ్లోటింగ్ బ్రిడ్జ్‌ను సందర్శకులకు అందుబాటులోకి తీసుకొస్తారు. ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జి పైకి వెళ్లేందుకు ఒక్కొక్కరి దగ్గర్నుంచి రూ.100 నుంచి రూ.150 దాకా రుసుం వసూలు చేసే అవకాశం ఉంది. ఫ్లోటింగ్ బ్రిడ్జ్ పనుల కోసం విశాఖపట్నం మెట్రో రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (వీఎంఆర్డీ) టెండర్లు వేయగా.. శ్రీసాయి మోక్ష షిప్పింగ్ అండ్ లాజిస్టిక్స్ సంస్థ పనులను దక్కించుకుంది. కోటి రూపాయల ఖర్చుతో సదరు సంస్థ ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జ్‌ను ఏర్పాటు చేసింది.