HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >First Bird Flu Death In Ap

First Bird Flu Death In AP: ఏపీలో తొలి బర్డ్‌ఫ్లూ మరణం..

ఆంధ్రప్రదేశ్‌లో బర్డ్‌ఫ్లూ కారణంగా మృతిచెందిన చిన్నారి ఘటన తీవ్ర కలకలం సృష్టిస్తోంది. రాష్ట్రంలో తొలి బర్డ్‌ఫ్లూ మరణం వెలుగు చూసిన తర్వాత, కేంద్ర ప్రభుత్వం వెంటనే తగు జాగ్రత్తలు తీసుకుంటూ రంగంలోకి దిగింది.

  • Author : Vamsi Chowdary Korata Date : 04-04-2025 - 2:53 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
First Bird Flu Death In Ap
First Bird Flu Death In Ap

First Bird Flu Death In AP: ఆంధ్రప్రదేశ్‌లో బర్డ్‌ఫ్లూ కారణంగా మృతిచెందిన చిన్నారి ఘటన తీవ్ర కలకలం సృష్టిస్తోంది. రాష్ట్రంలో తొలి బర్డ్‌ఫ్లూ మరణం వెలుగు చూసిన తర్వాత, కేంద్ర ప్రభుత్వం వెంటనే తగు జాగ్రత్తలు తీసుకుంటూ రంగంలోకి దిగింది. నరసరావుపేటకు చెందిన రెండు సంవత్సరాల చిన్నారి బర్డ్‌ఫ్లూ వల్ల మరణించడంతో, కేంద్రం ఈ ఘటనపై తీవ్ర దృష్టి పెట్టింది.

సమాచారం అందుకున్న వెంటనే, కేంద్ర వైద్య బృందం రాష్ట్ర ప్రభుత్వాన్ని అలర్ట్ చేసి, సెక్యూరిటీ చర్యలు తీసుకోవాలని సూచించింది. దీనితో, ఢిల్లీ ఎన్‌సీబీకి చెందిన ముగ్గురు సభ్యులు, ముంబైకి చెందిన ఒక డాక్టర్, అలాగే మంగళగిరి ఎయిమ్స్ డాక్టర్‌లతో కూడిన ఒక ప్రత్యేక బృందం, ఈ ఘటనపై పరిశీలన ప్రారంభించింది.

మొదటగా, ఎయిమ్స్‌లో ఉన్నతాధికారులతో సమావేశమై, చిన్నారి ఆరోగ్య పరిస్థితి, ఆమె జబ్బు పడ్డ సమయం, ఆస్పత్రిలో చేరిన సమయంలో జరిగిన చికిత్స, వైద్యం తదితర అంశాలపై చర్చలు జరిపారు. తరువాత, నరసరావుపేటలో చిన్నారి కుటుంబసభ్యులతో మాట్లాడి, వారు కొనుగోలు చేసిన చికెన్ షాపు నుంచి శాంపిల్స్ సేకరించారు. అంతేకాదు, కలెక్టరేట్‌లోని అధికారులతో సమావేశమై, అన్ని వివరణాత్మక సమాచారాన్ని సమీకరించారు.

మరోవైపు, నరసరావుపేటలో బర్డ్‌ ఫ్లూతో బాధితమైన రెండేళ్ల చిన్నారి మరణం తరువాత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా, చిన్నారి కుటుంబ సభ్యులు, సమీప గ్రామాల ప్రజల ఆరోగ్య పరిస్థితి పై సర్వేలు కొనసాగిస్తున్నామని, ఆరోగ్యశాఖ అధికారులు సీఎంకు తెలిపారు.

అంతే కాకుండా, ఆ ప్రాంతంలో కొత్తగా పాజిటివ్‌ కేసులు నమోదుకాలేదని, ఇప్పటి వరకు ఆ ప్రాంతంలో ఆరోగ్య పరిస్థితి ఆధారంగా ప్రత్యేక అలర్ట్‌ కొనసాగిస్తున్నామని అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం విశాఖపట్నం, విజయవాడ, కర్నూలు ప్రాంతాల్లో ఐసోలేషన్‌ వార్డులు సిద్ధం చేయాలని నిర్ణయించామని కూడా వివరించారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Bird flu
  • Bird Flu Alert
  • Bird Flu Alert In AP
  • Bird Flu Case
  • CM Chandrababu
  • First Bird Flu Death In AP
  • nara lokesh

Related News

Nara Lokesh garu met Punarvika's family after she received an injection today

Punarvika: చిన్నారి పునర్వికకు రూ.16 కోట్ల ఇంజెక్షన్‌ తెప్పించిన లోకేశ్‌

Nara Lokesh లక్షల హృదయాల ప్రార్థనలు ఓవైపు, మంత్రి నారా లోకేశ్ కృషి మరోవైపు… అరుదైన వ్యాధితో బాధపడుతున్న చిన్నారి పునర్విక ప్రాణాన్ని నిలబెట్టాయి. కొన్ని నెలలుగా ‘సేవ్ పునర్విక’ అంటూ సామాజిక మాధ్యమాల్లో సాగిన మానవతా ఉద్యమానికి సార్థకత లభించింది. ఆ పసిమొగ్గకు ప్రాణం నిలిచింది. అరుదైన స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ (SMA టైప్-1) వ్యాధితో ప్రాణాలతో పోరాడుతున్న ఏడాది చిన్నారి పునర

  • AP Education Minister Nara Lokesh

    TDP Working President : నారా లోకేష్ పదవి పై వర్మ కీలక వ్యాఖ్యలు

  • nara lokesh with pawan kalyan

    నారా లోకేష్‌కు శుభాకాంక్షలు చెప్పిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

  • Nara Lokesh

    Nara Lokesh : తెలుగుదేశం ‘యువ’ గర్జన.. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నారా లోకేష్‌ పట్టాభిషేకం!

  • Telugu Desam Party Appoints

    NARA LOKESH: పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా మంత్రి నారా లోకేష్

Latest News

  • నిద్ర‌లేమి స‌మ‌స్య‌.. క‌ళ్ల‌పై ప్ర‌భావం?

  • నేడు గుజరాత్ vs ముంబై మ్యాచ్‌.. గెలుపెవ‌రిది?

  • Stone-Grinding Process : పిండి రుబ్బే సరికొత్త పరికరాన్ని తీసుకొచ్చిన సాఫ్టెల్ సంస్థ

  • Lip Lock : విజయ్ దేవరకొండ కు లిప్ లాక్ ఇవ్వలని ఉందంటూ పబ్లిక్ గా చెప్పిన నటి..మరి రష్మిక పర్మిషన్ ఇస్తుందా ?

  • వేసవిలో ఏసీలు ఎందుకు పేలుతాయి?

Trending News

    • అమెరికా-ఇరాన్ చర్చలకు నో చెప్పిన టెహ్రాన్‌.. ఇస్లామాబాద్‌లో మాత్రం లాక్‌డౌన్!

    • రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి పెరగనున్న కష్టాలు!

    • మ‌రోసారి మెటాలో ఉద్యోగాల కోత‌?!

    • కొత్త జట్టుకు యజమానిగా క్రిస్ గేల్!

    • HBDOneAndOnlyCBN : చంద్రబాబుకు భువనేశ్వరి ఎమోషనల్ బర్త్ డే విషెస్

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd