Fire Accident : తిరుపతి గోవిందరాజ ఆలయం వద్ద భారీ అగ్నిప్రమాదం.
తిరుపతిలోని గోవిందరాజ స్వామి ఆలయం సమీపంలోని ఓ భవనంలో ఉన్న ఫోటో ఫ్రేమ్‌ల తయారీ యూనిట్‌లో శుక్రవారం భారీ
- By Prasad Published Date - 02:59 PM, Fri - 16 June 23

తిరుపతిలోని గోవిందరాజ స్వామి ఆలయం సమీపంలోని ఓ భవనంలో ఉన్న ఫోటో ఫ్రేమ్‌ల తయారీ యూనిట్‌లో శుక్రవారం భారీ అగ్నిప్రమాదం జరిగింది.ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు కాని ముగ్గురు వ్యక్తులు మంటల్లో చిక్కుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు. నాలుగు అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్థలానికి చేరుకుని గోవిందరాజ స్వామి ఆలయ రథం వైపు మంటలు వ్యాపించకుండా అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఆలయానికి ఆనుకుని ఉన్న లావణ్య ఫోటో ఫ్రేమ్ వర్క్స్‌లో మంటలు చెలరేగినట్లు పోలీసులు తెలిపారు. మంటలు భవనం మొత్తాన్ని చుట్టుముట్టాయి. ప్రత్యక్ష సాక్షుల తెలిపిన వివరాల ప్రకారం, ఐదు అంతస్తుల భవనంలోని ఒక అంతస్తులో ఉన్న ఫోటో ఫ్రేమ్ షాప్ నుండి మంటలు వ్యాపించాయనిజజ షాపులోని కార్మికులు, భవనంలోని వారంతా సురక్షితంగా బయటకు పరుగులు తీశారు. భవనం ముందు పార్క్ చేసిన ఐదు ద్విచక్ర వాహనాలు కూడా మంటల్లో దగ్ధమయ్యాయి. ఫోటో ఫ్రేమ్ షాపులో సుమారు కోటి రూపాయల నష్టం వాటిల్లినట్లు అంచనా. షాపులో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు అనుమానిస్తున్నారు. ల్యామినేషన్, ఇతర ఫోటో సంబంధిత పనుల కోసం దుకాణంలో నిల్వ ఉంచిన రసాయనాలు మంటల తీవ్రతను పెంచాయి.