Akkineni Hospital: విజయవాడ అక్కినేని ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం!
ఇటీవలి కాలంలో కొన్ని ప్రాంతాల్లో తరచూ అగ్నిప్రమాదాలు జరుగుతున్నాయి. షార్ట్ సర్క్యూట్, కెమికల్ పేలుడు, గ్యాస్ లీకేజీ వంటి ఘటనలతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ మంటల కారణంగా ఎంతో మంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు.
- By Praveen Aluthuru Published Date - 04:10 PM, Tue - 5 December 23

Akkineni Hospital: ఇటీవలి కాలంలో కొన్ని ప్రాంతాల్లో తరచూ అగ్నిప్రమాదాలు జరుగుతున్నాయి. షార్ట్ సర్క్యూట్, కెమికల్ పేలుడు, గ్యాస్ లీకేజీ వంటి ఘటనలతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ మంటల కారణంగా ఎంతో మంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. మరికొందరు తీవ్ర గాయాలతో జీవితాన్ని నరకయాతన అనుభవిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్ నాంపల్లిలో ఘోర అగ్నిప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఓ అపార్ట్ మెంట్ కింద నిల్వ ఉంచిన రసాయనాలు పేలి పది మంది మృతి చెందిన విషయం తెలిసిందే. తాజాగా ఏపీలోని ఓ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం జరిగింది.
ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని ఓ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం జరిగింది. బెజవాడ నగరంలోని అక్కినేని మహిళా ఆసుపత్రిలో అగ్నిప్రమాదం జరిగింది. ఆసుపత్రి పై అంతస్తులో మంటలు చెలరేగాయి. దీంతో రోగులు, సహాయకులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే ఆస్పత్రి సిబ్బంది అప్రమత్తమై రోగులకు ఎలాంటి ప్రమాదం జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. మరోవైపు స్థానికులు అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైరింజన్లతో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకురావడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో రోగులకు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.అయితే ఈ ప్రమాదం కారణంగా స్వల్ప ఆస్తినష్టం జరిగినట్లు తెలుస్తోంది. షాట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగి ఉంటుందని స్థానికులు అనుమానిస్తున్నారు. ఏది ఏమైనా ప్రాణ నష్టం జరగకపోవడంతో ఆస్పత్రి అధికారులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
Also Read: Vijayashanthi : కేసీఆర్ ఓటమి చెందడం ఫై బాధ వ్యక్తం చేసిన విజయశాంతి