Fees Poru Protest : ‘ఫీజుపోరు’..జగన్ నువ్వా..ఈ మాట అనేది..?
Fees Poru Protest : భూకబ్జాలు, మోసాలు , ఇలా ఎన్నో చేసిన జగన్..ఇప్పుడు 'ఫీజుపోరు' (Fees Poru Protest)అంటూ వ్యాఖ్యలు చేయడం పై యావత్ యువత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
- By Sudheer Published Date - 07:20 PM, Sun - 2 February 25

అవినీతికి కేరాఫ్ గా ఉండే జగన్(Jagan)..నీతి మాటలు చెప్పడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. భూకబ్జాలు, మోసాలు , ఇలా ఎన్నో చేసిన జగన్..ఇప్పుడు ‘ఫీజుపోరు’ (Fees Poru Protest)అంటూ వ్యాఖ్యలు చేయడం పై యావత్ యువత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫిబ్రవరి 5న వైసీపీ చేపట్టే ‘ఫీజుపోరు’ కార్యక్రమం పై టీడీపీ విమర్శలకు దిగింది.
విద్యార్థులకు ఇవ్వవలసిన ఫీజు రీయింబర్స్‌మెంటు, వసతి దీవెన సకాలంలో చెల్లించకుండా విద్యార్థులను నట్టేట ముంచిన జగన్..ఇప్పుడు ఫీజుపోరు పేరిట నిరసనకు పిలుపునివ్వడం హాస్యా స్పదంగా ఉందని అంటున్నారు. ఐదేళ్ల అధికారంలో ఉన్న సమయం లో గుర్తుకు రాని రీయింబర్స్‌మెంటు, వసతి దీవెన జగన్‌కు ప్రతిపక్షంలో ఉండగా హఠాత్తుగా ఎలా గుర్తుకువచ్చాయని ప్రశ్నించారు. వందల కోట్లు పెండింగ్‌లో ఉం డడంతో విద్యార్థులు రోడ్డెక్కి నిరసనలు చేపట్టినా అప్పట్లో పట్టించుకునే నాథుడే లేడన్నారు. ఫీజుపోరు కార్యక్రమాన్ని నిర్వహించే ముందు జగన్, వైసీపీ నాయకులు ఆలోచించాలన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన ఏడు నెలల్లో ఫీజు రీయింబర్స్ మెంటు, వసతి దీవెన్ తదితర వాటికి ప్రభుత్వం నిధులు విడుదల చేసిందని గుర్తు చేశారు.
Vijayasai Reddy : విజయసాయి రెడ్డి యూటర్న్.. ? షర్మిలతో భేటీ అందుకేనా ?
పేద విద్యార్థులు చదువు, ఉద్యోగాలు రాజశేఖర్ రెడ్డి పెట్టిన భిక్ష అని వాగుతున్న జోగి మాటలకు అర్ధం ప్రజలు బిక్షగాళ్లు అనేనా? ప్రజలను బిక్షగాళ్లతో పోలుస్తున్న వైసీపీ నేతలకు అసలు నాయకులుగా కొనసాగే అర్హత లేదని ఆగ్రహం వ్యక్తం చేసారు. గతంలో ఉన్న ఫీజు రీయంబర్స్ మెంట్ ని విద్యా దీవెనగా మార్చి తామేదో కొత్తగా ఈ పధకాన్ని సృష్టించినట్లు సిగ్గులేకుండా జగన్ రెడ్డి ప్రచారం చేసుకున్నాడు.
2014-2019 టీడీపీ పాలనలో ఏటా 16 లక్షల మంది విద్యార్ధులకు ఫీజ్ రీయంబర్స్ మెంట్ చేస్తే జగన్ రెడ్డి పాలనలో కేవలం 9 లక్షల మందికి అది కూడా విడతల వారీగా ఇచ్చి, దాదాపు 7 లక్షల మంది పేద విద్యార్ధులను మోసగించి ఇంకా సిగ్గులేకుండా మాట్లాడతారా? విద్యా దీవెన అని గొప్పలు చెప్పి తల్లిదండ్రులతో అప్పులు చేయించి విద్యార్థులను ముప్పు తిప్పలు పెట్టి వారిని మానసిక క్షోభ పెట్టిన నీచుడు జగన్. వైసీపీ ప్రభుత్వం పెట్టిన బకాయిల వలన డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్, ట్రిపుల్ ఐటీ, ఇతర కోర్సులు పూర్తి చేసిన ఉన్నత విద్య చదివే అవకాశం లేక పలువురు, ఉద్యోగావకాశాలు కోల్పోయి మరికొందరు విద్యార్థులు సతమతమయ్యారు. ఏ మొహం పెట్టుకుని ఇప్పుడు ధర్నా చేస్తున్నారు? అని అంత ప్రశ్నిస్తున్నారు.
మీ దరిద్రపు పాలనలో ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు రాకపోవడంతో 2022లో శ్రీకాకుళం ప్రాంతానికి చెందిన ఓ యువతి… ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ ముందే కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యకు ప్రయత్నించింది నిజామా కాదా? అని ప్రశ్నించారు. 2021-22 4వ క్వార్టర్ నగదు విడుదల చేయకపోవడంతో విజయవాడలోని ఓ కాలేజీ రూ.60 వేల ఫీజు కట్టాలని ఓ విద్యార్థికి కాలేజీ యాజమాన్యం తాఖీదు ఇచ్చింది లేదంటే పరీక్షలు రాయనీయబోమని ఇబ్బంది పెట్టింది నిజామా కాదా? చిత్తూరు జిల్లాలోని ఓ ప్రముఖ కాలేజీకి గత ప్రభుత్వం రీయింబర్స్ మెంట్ నిధులను బకాయి పెట్టడంతో 2018-19లో పూర్తిచేసిన కోర్సుకు సంబంధించిన రూ.57 వేల ఫీజు బకాయిని 15 రోజుల్లో చెల్లించాలని, లేనిపక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కాలేజీ నుంచి లీగల్ నోటీసు అందింది నిజామా కాదా..? విద్యార్థులను ఫీజు కోసం లీగల్ నోటీసులు అందుకునేలా చేసిన మీరా ధర్నాలు చేసేది..? సిగ్గు అనే మాటకు అర్ధం తెలుసా మీకు? అని వర్ష ప్రశ్నలు సందిస్తున్నారు.
డిసెంబర్ 17, 2023న నెల్లూరు జిల్లా కావలిలో ఫీజ్ రీయింబర్స్ మెంట్ డబ్బులు అందలేదని దాదాపు 30 మంది ఫైనల్ ఇయర్ నర్సింగ్ విద్యార్ధులను నర్సింగ్ కళాశాల బయటకు పంపేసింది నిజామా కాదా? వైసీపీ దొంగ ముఠా వీటికి సమాధానం చెప్పాలి. ఇవ్వని ఫీజులకు కూడా పెద్ద పెద్ద పేపర్ ప్రకటనలు ఇచ్చుకుని బాకా కొట్టుకుంది మీరు కాదా? ఫీజు రీయింబర్స్‌మెంట్ -రూ.2,832 కోట్లు, వసతి దీవెన బకాయిలు – రూ.989 కోట్లు, పీజీ ఫీజ్ రీయింబర్స్‌మెంట్ -రూ.450 కోట్లు బకాయిల కుప్పపెట్టి, అందినకాడికి దోచుకుని, బెంగళూరు ప్యాలస్ లో కూర్చొని నీచరాజకీయాలు నడుపుతున్న వైసీపీ దొంగల ముఠా నాయకుడు జగన్ రెడ్డి.
ఎలాంటి అవాంతరాలు లేకుండా కాలేజీలకే నేరుగా ఫీజులు చెల్లించే విధానాన్ని మార్చేసి తల్లుల ఖాతాలకే అని నీ రాజకీయ అవసరం కోసం విద్యార్థులను ఇబ్బంది పెట్టలేదా జగన్ రెడ్డి? ఆ ఫీజులు కూడా విడతల వారీ చెల్లింపులు అన్నాడు, కాలేజీలు అంగీకరించకపోవడం వలన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్ధులను పెద్ద కాలేజీలకు దూరం అయ్యారు… ఈ పాపం నీది కాదా జగన్ రెడ్డి? 5 ఏళ్లకు ఏడాదికి 4 విడతలు ఎగ్గొట్టి కేవలం ఫీజులకే రూ.4,271 కోట్లబకాయిలు పెట్టిన నువ్వు కాదా అసలు 420 జగన్ రెడ్డి? ఇప్పటికే కూటమి ప్రభుత్వం రూ.788 కోట్ల ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేసింది. వివిధ కళాశాలల్లో నిలిచిపోయిన 10లక్షల మంది విద్యార్థుల సర్టిఫికెట్లను విద్యార్థులకు అందేలా చర్యలు తీసుకున్నది. విద్యార్థులను ఫీజు కోసం ఇబ్బంది పెడితే చర్యలు తీసుకుంటామని కాలేజీలకు ఆదేశాలు ఇవ్వటం జరిగింది. ఇలా ఎన్నో తప్పులు చేసి ఇప్పుడు ఫీజుపోరు అంటున్న నీకు సిగ్గుందా..? అని అంత ప్రశ్నిస్తున్నారు.