Andhra Pradesh : ఏపీలో 16 బార్లకు నోటిఫికేషన్ విడుదల చేసిన ఎక్సైజ్ శాఖ
ఆంధ్రప్రదేశ్‌లో 16 బార్లలకు నోటిఫికేషన్ విడుదలైంది. రెండేళ్లపాటు అంటే 2023–2025 వరకు కేటాయిస్తూ ఆంధ్రప్రదేశ్
- Author : Prasad
Date : 21-10-2023 - 10:51 IST
Published By : Hashtagu Telugu Desk
ఆంధ్రప్రదేశ్‌లో 16 బార్లలకు నోటిఫికేషన్ విడుదలైంది. రెండేళ్లపాటు అంటే 2023–2025 వరకు కేటాయిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ 16 బార్‌లు 2023–24లో లైసెన్స్ ఫీజులు, తిరిగి చెల్లించలేని రిజిస్ట్రేషన్ ఛార్జీలు, బిడ్ మొత్తాలను చెల్లించడంలో విఫలమైన వారికి చెందినవి అని ఎక్సైజ్ శాఖ తెలిపింది. ఆసక్తి ఉన్న వారు ఈ వేలంలో పాల్గొనవచ్చని, ఈ-వేలం, ఆన్‌లైన్ ద్వారా బార్‌లను కేటాయించనున్నారు. లైసెన్స్‌ల కోసం ఇప్పటికే ఎక్సైజ్ శాఖ రిజిస్ట్రేషన్‌లను ప్రారంభించింది. అక్టోబర్ 28 వరకు రిజిస్ట్రేషన్ అందుబాటులో ఉంటుంది. బార్‌లకు సంబంధించిన వివరాల్నిగెజిట్ నోటిఫికేషన్‌లో అందుబాటులో ఉంటాయి. బార్ లైసెన్స్ పొందేందుకు పేర్లు నమోదు చేసుకున్న వారు 50 వేల జనాభా ఉన్న ప్రాంతాలకు రూ.5 లక్షలు నాన్ రిఫండబుల్ ఫీజు చెల్లించాలని ఎక్పైజ్ శాఖ పేర్కొంది. అలాగే 50 వేల నుంచి 5 లక్షల జనాభాకు రూ.7.5 లక్షలు, 5 లక్షలకు పైగా జనాభా ఉన్న ప్రాంతాలకు రూ.10 లక్షలు చెల్లించాలని ఆ శాఖ వివరించింది. మరిన్ని వివరాల కోసం, ఆసక్తిగల వారు http://apcpe.aptonline.in ఈ వైబ్సైట్‌ని సందర్శిచవచ్చని తెలిపింది.
Also Read: Delta Force : ఇజ్రాయెల్‌లో అమెరికా ‘డెల్టా ఫోర్స్’ .. ఏం చేయబోతోంది ?