TDP : ఎన్నికల్లో నిజాయితీగా గెలిచే సత్తా లేకనే జగన్ రెడ్డి కుట్ర రాజకీయాలు : మాజీ మంత్రి కె.ఎస్. జవహర్
సజ్జలకు రామకృష్ణారెడ్డికి సాంబార్ అన్నం మీద ఉన్న శ్రద్ద సబ్జెక్ట్ పై ఉండదని మాజీ మంత్రి కె.ఎస్.జవహర్ ఎద్దేవా చేశారు. తానే
- Author : Prasad
Date : 04-11-2023 - 8:24 IST
Published By : Hashtagu Telugu Desk
సజ్జలకు రామకృష్ణారెడ్డికి సాంబార్ అన్నం మీద ఉన్న శ్రద్ద సబ్జెక్ట్ పై ఉండదని మాజీ మంత్రి కె.ఎస్.జవహర్ ఎద్దేవా చేశారు. తానే అపర మేధావినన్నట్టు అడ్డగోలుగా మాట్లాడటం తప్ప ఆయన మాటల్లో అసలు విషయం ఉండదన్నారు. జగన్ కి ఉన్న పిచ్చి ముదిరి చంద్రబాబుపై రోజుకొక అక్రమ కేసు పెడుతున్నారని ఆయన ఆరోపించారు. ఇసుకలో రూ. 40 వేల కోట్లు దోపిడి చేసిన జగన్ రెడ్డి చంద్రబాబుపై అక్రమ కేసు పెట్టడం సిగ్గుచేటన్నారు. సామాజిక న్యాయం అంటూ సంకలు గుద్దుకుంటూ.. దళిత మహిళా నేతపై అక్రమ కేసు పెట్టడం ఏ సామాజిక న్యాయమని ఆయన ప్రశ్నించారు. ఉచిత ఇసుక రద్దు చేసి, 40 లక్షల మంది కార్మికుల్ని రోడ్డున పడేసి 160 మంది భవన నిర్మాణ కార్మికుల్ని బలిగొన్న దుర్మార్గుడు జగన్ రెడ్డి అని.. ఇసుకను మీరు దోచేసి ఉచితంగా ఇసుక ఇచ్చిన చంద్రబాబుపై అక్రమ కేసు సిగ్గనింపించటం లేదా? అని ప్రశ్నించారు.
We’re now on WhatsApp. Click to Join.
టీడీపీ హయాంలో ఏపీ.ఎం.డీ.సీని నోడల్ ఏజెన్సీగా నియమించి, దాని ద్వారా మహిళా సమాఖ్యలకు ఇసుక రీచ్ లు అప్పగించాలని.. తద్వారా వచ్చే లాభాలలో 25 శాతం ఆదాయం మహిళా సంఘాలకు దక్కేలా చేయాలని ఆదేశిస్తూ జీవో – 94 ఇచ్చామన్నారు. ఈ డ్వాక్రా మహిళలలో అధిక శాతం బడుగు, బలహీన వర్గాలేనని.. ఆ వర్గాలు ఆర్దికంగా అభివృద్ది చెందటం ఇష్టం లేకనే నాడు జగన్, వైసీపీ నేతలు ఇసుక లో అవినీతి అంటూ తప్పడు ప్రచారం చేశారన్నారు. చంద్రబాబు నాయుడి హయాంలో ఇసుక తవ్వకాలపై ఎన్జీటీ జరిమానా విధించని వైసీపీ చెబుతోందని.. కానీ ఎన్జీటీ తుదితీర్పులో తాము గతంలో నియమించిన ఎక్స్ పర్ట్ కమిటీ ఇచ్చిన నివేదికతో పూర్తిగా సంతృప్తి చెందామని, ఇంకా అదనంగా ఎలాంటి నివేదికలు ఇవ్వాల్సిన పనిలేదని అభిప్రాయపడుతూ.. ఎక్స్ పర్ట్ కమిటీ చాలా స్పష్టంగా ఇసుక తవ్వకాల వల్ల పర్యావరణానికి ఎటువంటి నష్టం జరగలేదని పేర్కోందన్నారు. వచ్చే ఎన్నికల్లో నిజాయితీగా గెలిచే సత్తా లేకనే జగన్ రెడ్డి కుట్ర రాజకీయాలకు తెరలేపారని.. ఈ కుట్ర రాజకీయాల్ని ప్రజలు చిత్తు చేసి వైసీపీని చిత్తు చిత్తుగా ఓడించటం ఖాయమన్నారు.
Also Read: Etela Rajender: కేసీఆర్ వేల కోట్లు ఖర్చుపెట్టినా గజ్వేల్ లో గెలుపు నాదే: ఈటల రాజేందర్