Etela Rajender: కేసీఆర్ వేల కోట్లు ఖర్చుపెట్టినా గజ్వేల్ లో గెలుపు నాదే: ఈటల రాజేందర్
బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ గెలుపు కోసం వేల కోట్లు ఖర్చుపెట్టినా గజ్వేల్ లో నేనే గెలుస్తానని బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఈటల రాజేందర్ ధీమా వ్యక్తం చేశారు.
- By Balu J Published Date - 05:23 PM, Fri - 3 November 23

Etela Rajender: బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ గెలుపు కోసం వేల కోట్లు ఖర్చుపెట్టినా గజ్వేల్ లో నేనే గెలుస్తానని బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఈటల రాజేందర్ ధీమా వ్యక్తం చేశారు. గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని తిగుల్ నర్సాపూర్ గ్రామంలో శ్రీ కొండపోచమ్మ అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన ఎన్నికల ప్రచారాన్నినిర్వహించారు.
కేసీఆర్ వేల కోట్లు ఖర్చుపెట్టినా కూడా మీకు స్వచ్ఛందంగా ఓట్లు వేసి గెలిపించుకుంటామని గజ్వేల్ ప్రజలు ఆశీర్వదిస్తున్నారని ఈటల పేర్కొన్నారు. హుజురాబాద్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధర్మ యుద్ధం చేస్తే ఆ యుద్ధంలో ధర్మం గెలిచిందని..తాను కూడా గెలిచానని బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ పేర్కొన్నారు.
దమ్ముంటే రాజీనామా చేసి గెలిచి చూపించాలని కేసీఆర్ అంటే.. రాజీనామా చేసి గెలిచి చూపించానన్నారు.న్నారు. ఆనాడు గజ్వేల్‌లో మీ మీద పోటీ చేస్తానని చెప్పిన విధంగానే పోటీకి దిగానని సవాల్ విసిరారు. ఈ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ రెండు నియోజకవర్గాల్లో పోటీ చేసినట్టే, ఈటల రాజేందర్ కూడా ఈ ఎన్నికల్లో రెండు స్థానాల్లో పోటీ చేస్తుండటం ఆసక్తిని రేపుతోంది. అయితే కేసీఆర్ ఒకమారు మాత్రమే గజ్వేల్ ను సందర్శిస్తే, ఈటల మాత్రం వరుస సభలు, సమావేశాలు నిర్వహిస్తూ ప్రచారంలో దూసుకుపోతున్నారు.
Also Read: Etela Rajender: కేసీఆర్ వేల కోట్లు ఖర్చుపెట్టినా గజ్వేల్ లో గెలుపు నాదే: ఈటల రాజేందర్