AP Inter Results 2025 : ఆ కాలేజీలో అందరూ ఫెయిల్..ఎందుకని ?
AP Inter Results 2025 : కడప జిల్లా కమలాపురం ప్రభుత్వ జూనియర్ కాలేజీ లో ఫలితాలు విద్యార్థులు, తల్లిదండ్రులను షాక్ కు గురి చేసాయి
- By Sudheer Published Date - 02:33 PM, Sat - 12 April 25

ఏపీ ఇంటర్మీడియట్ ఫలితాలు 2025 (AP Inter Results 2025) వచ్చేసాయి. ఈ ఫలితాలతో రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థుల్లో ఆనందోత్సాహం నెలకొంది. మొత్తం 10,17,102 మంది విద్యార్థులు ఈసారి పరీక్షలకు హాజరయ్యారు. ఫలితాలను మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) ఎక్స్ (ట్విట్టర్) ద్వారా అధికారికంగా విడుదల చేశారు. ఫలితాలను resultsbie.ap.gov.in లేదా మనమిత్ర వాట్సాప్ నంబర్ 9552300009కు “హాయ్” అని పంపించి కూడా పొందవచ్చు. ఈ సంవత్సరం మొదటి సంవత్సరం విద్యార్థులకు 70% ఉత్తీర్ణత శాతం, రెండో సంవత్సరం విద్యార్థులకు 83% ఉత్తీర్ణత శాతం నమోదు కావడం గర్వకారణంగా మారింది.
Gujarat Titans: గుజరాత్ టైటాన్స్‌కు గట్టి ఎదురుదెబ్బ.. కీలక ఆటగాడు దూరం!
ఈ ఏడాది ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యార్థుల విజయ శాతం గతంలో కంటే మెరుగ్గా నమోదైంది. ముఖ్యంగా రెండో సంవత్సరం ప్రభుత్వ కళాశాలల్లో 69% ఉత్తీర్ణత శాతం రావడం గత పదేళ్లలోనే అత్యధికం. మొదటి సంవత్సరానికి 47% ఉత్తీర్ణత శాతం నమోదు కాగా, ఇది కూడా రెండవ అత్యధిక శాతం కావడం విశేషం. ఈ అభివృద్ధికి విద్యార్థులు, అధ్యాపకులు కలిసి కృషిచేసిన ఫలితమేనని మంత్రి నారా లోకేశ్ అన్నారు.
అయితే కడప జిల్లా కమలాపురం ప్రభుత్వ జూనియర్ కాలేజీ లో ఫలితాలు విద్యార్థులు, తల్లిదండ్రులను షాక్ కు గురి చేసాయి. ఈ కాలేజీలో ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు రాసిన 33 మంది విద్యార్థులంతా ఫెయిల్ కావడం, రెండవ సంవత్సరం పరీక్షలు రాసిన 14 మందిలో కేవలం ఇద్దరు మాత్రమే ఉత్తీర్ణత సాధించడమే ఇందుకు కారణం. ఏది ఏమైనప్పటికి గతంలో కంటే ఈ ఏడాది ఉత్తీర్ణత శాతం రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కువగా ఉండడం సంతోష దగ్గ విషయం.