HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Enthusiastic Entrepreneurs As Lecturers In 17 Andhra Pradesh Universities

Entrepreneurs : ఏపీ యూనివర్సిటీల్లో అధ్యాపకులుగా పారిశ్రామికవేత్తలు.. ఎందుకంటే ?

అదే జరిగితే.. ఏపీ వర్సిటీల్లోనూ(Entrepreneurs) ఇలాంటి వారికి అధ్యాపకులుగా అవకాశం కల్పిస్తారు.

  • Author : Pasha Date : 14-11-2024 - 10:04 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Entrepreneurs As Lecturers In Andhra Pradesh Universities Ugc

Entrepreneurs : ఎంత చదివినా.. నైపుణ్యం ఉంటేనే జాబ్ వస్తుంది. ప్రశ్నజవాబులను బట్టీ పడితే ఉద్యోగం రాదు. వాటితో పాటు కావాల్సింది ప్రాక్టికల్ స్కిల్. దీన్ని అందించే వారిని యూనివర్సిటీల్లో అధ్యాపకులుగా ఇకపై నియమించుకోవచ్చు. ఈమేరకు ప్రొఫెసర్ల నియామక నిబంధనల్లో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) మార్పులు చేయనుంది. ఒకవేళ యూజీసీ నిబంధనలు మారితే ఆంధ్రప్రదేశ్‌లోని నియామక ప్రక్రియలోనూ ఆమేరకు మార్పులు  జరిగే ఛాన్స్ ఉంది. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, స్టార్టప్స్, ఇండస్ట్రీ పార్ట్‌నర్‌షిప్‌ వంటి రంగాల్లో నిపుణులై, పీజీ చేసిన వారిని నేరుగా వర్సిటీ అధ్యాపకుడిగా నియమించుకునేందుకు యూజీసీ వీలు కల్పించబోతోంది. అదే జరిగితే.. ఏపీ వర్సిటీల్లోనూ(Entrepreneurs) ఇలాంటి వారికి అధ్యాపకులుగా అవకాశం కల్పిస్తారు.

Also Read :Brazil : బ్రెజిల్ సుప్రీంకోర్టుపై సూసైడ్ ఎటాక్.. భారీ పేలుళ్లు.. ఒకరు మృతి

పరిశ్రమలతో సంబంధమున్న వారిని యూనివర్సిటీల్లో లెక్చరర్లుగా నియమించుకోవాలనే ప్రతిపాదనపై యూజీసీ దాదాపు ఆరేడు నెలల పాటు అధ్యయనం చేసింది. సమగ్ర అధ్యయనం తర్వాత దీనికి సంబంధించిన ముసాయిదాను రెడీ చేసింది. త్వరలోనే దీనిపై యూజీసీ అభిప్రాయాలు, సూచనలను సేకరించనుంది. విద్యార్థులకు పరిశోధనలపై ఆసక్తిని పెంచేలా, జాబ్ స్కిల్స్‌ను పెంపొందించేలా బోధన ఉండాలని.. అందుకోసమే పరిశ్రమలతో సంబంధమున్న వారిని అధ్యాపకులుగా తీసుకోవాలని యోచిస్తున్నారు.  సాధారణంగానైతే పీజీతో పాటు పీహెచ్‌డీ చేసిన వారినే వర్సిటీల్లో అధ్యాపకులుగా నియమిస్తున్నారు. పరిశ్రమలతో సంబంధమున్న నిపుణులకు పీహెచ్‌డీ లేకున్నా.. కేవలం పీజీ ఉంటే అధ్యాపకులుగా అవకాశాన్ని కల్పిస్తారు.

Also Read :Meenaakshi Chaudhary : సంవత్సరంలో ఆరు సినిమాలు.. నెల గ్యాప్ లో మూడు సినిమాలు.. దూసుకుపోతున్న మీనాక్షి..

ఏపీ వర్సిటీల్లో బోర్డ్ ఆఫ్‌ గవర్నర్స్‌ 

రాష్ట్రంలోని యూనివర్సిటీల ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిళ్లను రద్దు చేయాలని టీడీపీ సర్కారు యోచిస్తోంది. వాటి స్థానంలో బోర్డు ఆఫ్‌ గవర్నర్స్‌ను నియమించాలని అనుకుంటోంది. ఇందులో పారిశ్రామికవేత్తలు ఛైర్మన్లుగా ఉంటారు. ఈమేరకు ఏపీ యూనివర్సిటీల చట్టానికి సవరణలు చేయనున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద టీడీపీ హయాంలో రాబోయే ఐదేళ్లలో ఏపీ విద్యా వ్యవస్థ విప్లవాత్మక మార్పులను చూడబోతోంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • ap
  • AP Universities
  • entrepreneurs
  • jobs
  • Lecturers
  • UGC

Related News

INS Mahendragiri joins the Indian Navy.

INS Mahendragiri: భారత నౌకాదళంలో చేరిన ఐఎన్‌ఎస్ మహేంద్రగిరి

రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ విశాఖపట్నం డాక్‌యార్డ్‌లో యుద్ధనౌకను ప్రారంభించారు. ప్రాజెక్ట్ 17A నీలగిరి-క్లాస్ ప్రోగ్రామ్ కింద ఆరవ నౌక అయిన, స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన స్టెల్త్ ఫ్రిగేట్ ఐఎన్ఎస్ మహేంద్రగిరిని ప్రారంభించడంతో భారత నౌకాదళం శనివారం తన నౌకాదళాన్ని బలోపేతం చేసుకుంది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ విశాఖపట్నం డాక్‌యార్డ్‌లో ఈ యుద్ధనౌకను ప్రారంభించారు

  • State-of-the-art showroom 'Elite Eco Energy' inaugurated in Bhimavaram.

    Elite Eco Energies: భీమవరంలో అత్యాధునిక షోరూమ్ ‘ఎలైట్ ఎకో ఎనర్జీస్’ ప్రారంభం

  • Good news for unemployed youth in Telangana: Green signal for RTC conductor posts.

    Jobs: తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఆర్టీసీ కండక్టర్ పోస్టులకు గ్రీన్ సిగ్నల్

  • Complaint filed against actor Prakash Raj at the police station.

    Prakash Raj: నటుడు ప్రకాష్ రాజ్ పై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు

Latest News

  • Vastu Tips: ఇంట్లో అరటి చెట్టు నాటితే అశుభమా..? శాస్త్రం ఏం చెబుతోంది..!!

  • Cigarette Alert: ఇప్పుడు బాక్స్‌పై కాదు, ప్రతి సిగరెట్‌పై హెచ్చరిక.. ఎక్కడంటే?

  • Harish Rao: బీజేపీతో టచ్‍లో హరీశ్ రావు : రేవంత్ రెడ్డి

  • True Love: ఒక వ్యక్తికి మీ మీద నిజంగా ప్రేమ ఉందో లేదో ఇలా తెలుసుకోవచ్చు!

  • Donald Trump: ముంచుకొస్తున్న డెడ్‌లైన్.. ఇరాన్‎కు ట్రంప్ మాస్ వార్నింగ్

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd