Meenaakshi Chaudhary : సంవత్సరంలో ఆరు సినిమాలు.. నెల గ్యాప్ లో మూడు సినిమాలు.. దూసుకుపోతున్న మీనాక్షి..
మీనాక్షి చౌదరికి ఈ సంవత్సరం బాగా కలిసి వచ్చినట్టు ఉంది. ఏకంగా ఈ ఇయర్ లో ఆరు సినిమాలు రిలీజ్ ఉన్నాయి ఈ అమ్మడికి.
- By News Desk Published Date - 07:04 AM, Thu - 14 November 24

Meenaakshi Chaudhary : మీనాక్షి చౌదరికి ఈ సంవత్సరం బాగా కలిసి వచ్చినట్టు ఉంది. ఏకంగా ఈ ఇయర్ లో ఆరు సినిమాలు రిలీజ్ ఉన్నాయి ఈ అమ్మడికి. బేసిక్ గా డెంటల్ డాక్టర్ అయిన మీనాక్షి చౌదరి మిస్ ఇండియా పోటీల్లో పాల్గొని నటన వైపు వచ్చింది. హిందీలో ఓ సినిమా చేసి తెలుగులో 2021 లో ఇచ్చట వాహనాలు నిలపరాదు అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించింది.
తెలుగులో మొదటి సినిమాతోనే మెప్పించిన మీనాక్షి చౌదరి ఆ తర్వాత ఖిలాడీ సినిమాలో తన అందాలతో అలరించింది. ఆ వెంటనే హిట్ 2 సినిమాలో చీరల్లో క్యూట్ గా కనపబడి అందర్నీ ఆకట్టుకుంది. దీంతో మీనాక్షి చౌదరికి తెలుగు, తమిళ్ లో వరుస అవకాశాలు వచ్చాయి. ఈ ఒక్క సంవత్సరంలోనే ఆరు సినిమాలు రిలీజ్ చేసిందంటే ఈ అమ్మడు ఎంత బిజీ ఉందో అర్ధం చేసుకోవచ్చు.
ఈ సంవత్సరం గుంటూరు కారం సినిమాతో మొదలుపెట్టి ఆ తర్వాత రెండు తమిళ్ సినిమాలు సింగపూర్ సెలూన్, ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం లతో అలరించింది. ఇటీవల దీపావళికి లక్కీ భాస్కర్ తో ప్రేక్షకులని మెస్మరైజ్ చేసింది. నేడు మట్కా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మరో వారం రోజుల్లో మెకానిక్ రాఖీ సినిమాతో మళ్ళీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఇలా నెల గ్యాప్ లో మూడు సినిమాలతో ప్రేక్షకులని పలకరిస్తుంది మీనాక్షి చౌదరి. దీంతో ఈ అమ్మడి బిజీ చూసి షాక్ అవుతున్నారు. చాలా తక్కువ టైంలోనే ఎక్కువ సినిమాలు చేస్తూ వరుస హిట్స్ కొడుతూ బిజీగా మారిన హీరోయిన్స్ లో మీనాక్షి చౌదరి ఒకరు. ఇప్పటికే ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం, లక్కీ భాస్కర్ సినిమాలతో హిట్స్ కొట్టింది. మరి నేడు మట్కా సినిమాతో హిట్ కొట్టి హ్యాట్రిక్ సాధిస్తుందేమో చూడాలి. మొత్తానికి తమిళ్, తెలుగులో ప్రస్తుతం ఈ హర్యానా భామ మీనాక్షి చౌదరి హవా నడుస్తుంది.
Also Read : Rana Daggubati : సరికొత్త టాక్ షోతో రానా దగ్గుబాటి.. ఆర్జీవీ, రాజమౌళి సహా ఎవరెవరు రాబోతున్నారంటే..