Election Commission : ఏపీలో ఉద్రిక్తతలపై ఈసీ సీరియస్.. సీఎస్, డీజీపీకి సమన్లు
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ఘట్టం ముగిసిన తర్వాత పల్నాడు, చంద్రగిరి, తాడిపత్రి, సత్తెనపల్లి, మాచర్ల, తిరుపతి సహా పలుచోట్ల హింసాత్మక ఘటనలు జరగడంపై కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) సీరియస్ అయింది.
- By Pasha Published Date - 04:23 PM, Wed - 15 May 24

Election Commission : ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ఘట్టం ముగిసిన తర్వాత పల్నాడు, చంద్రగిరి, తాడిపత్రి, సత్తెనపల్లి, మాచర్ల, తిరుపతి సహా పలుచోట్ల హింసాత్మక ఘటనలు జరగడంపై కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) సీరియస్ అయింది. దీనిపై వివరణ కోరుతూ డీజీపీ హరీశ్ కుమార్, సీఎస్ జవహర్ రెడ్డికి ఈసీ సమన్లు జారీ చేసింది. ఇద్దరూ వ్యక్తిగతంగా ఢిల్లీలో తమ ఎదుట హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. వివరణ ఇచ్చేందుకు సీఎస్, డీజీపీ రేపు ఢిల్లీకి వెళ్లనున్నట్లు సమాచారం. ఏపీలో ఎన్నికల తరువాత జరుగుతున్న హింసను అరికట్టడంలో డీజీపీ, సీఎస్‌లు విఫలమయ్యారని ఈసీ(Election Commission) అభిప్రాయపడింది.
We’re now on WhatsApp. Click to Join
పులివర్తి నానిపై తిరుపతిలో దాడి
చంద్రగిరి నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన పులివర్తి నానిపై మంగళవారం తిరుపతిలో దాడి జరిగింది.తిరుపతి పద్మావతి యూనివర్సిటీలోని స్ట్రాంగ్ రూం పరిశీలనకు వెళ్లి వస్తు్న్న పులివర్తి నానిపై వైసీపీ శ్రేణులు దాడి చేశారు. ఆ దాడిని నిరసిస్తూ మహిళా యూనివర్సిటీ రోడ్డుపైనే నాని బైఠాయించి నిరసన తెలిపారు. వైసీపీ శ్రేణులను చెదరగొట్టేందుకు పులివర్తి నాని భద్రతా సిబ్బంది గాల్లోకి రెండు రౌండ్ల కాల్పులు జరిపారు.కారు బ్యానెట్‌కు ఉన్న కెమెరాలో దాడి ఫుటేజీ అంతా రికార్డు అయింది. టీడీపీ కార్యకర్తలు అక్కడికి చేరుకొని వైసీపీ నేతలను తరిమికొట్టారు. అక్కడే ఉన్న వైసీపీ నేతల కారు, బైక్ ను టీడీపీ నేతలు ధ్వంసం చేశారు.
Also Read : AP : గర్భిణి అని కూడా చూడకుండా దాడి చేసిన వైసీపీ రాక్షసులు – నారా లోకేష్
- పల్నాడు జిల్లా కారంపూడిలో మే 13న పోలింగ్ రోజున గొడవల్లో గాయపడిన వారిని పరామర్శించేందుకు పేటసన్నెగండ్ల గ్రామానికి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వెళ్తుండగా.. కారంపూడిలో తన అనుచరులతో కలిసి ఎమ్మెల్యే హల్‌చల్ చేశారనే ఆరోపణలు ఉన్నాయి. వారంతా టీడీపీ కార్యాలయం ధ్వంసం చేయటంతో పాటు అక్కడ ఉన్న టీడీపీ నేత జానీ బాషా వాహనానికి నిప్పు అంటించారు. దాడులు ఆపేందుకు యత్నించిన కారంపూడి సీఐపై దాడికి తెగబడినట్లుగా ఆరోపణలు వచ్చాయి.
- తాడిపత్రిలో ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి విధ్వంసం సృష్టించారనే అభియోగాలు ఉన్నాయి. చింతలరాయుని పాళెంలో ఉన్న వైఎస్సార్ సీపీ ఏజెంట్లు సంజీవ, అజయ్, మరో నలుగురు కలిసి టీడీపీ ఏజెంట్ భాను, ఆ పార్టీ వర్గీయుడు మోహన్‌లపై దాడి చేశారు.