Teachers Issue : టీచర్ల నియామకం ఇప్పట్లో లేనట్టే! విద్యా సంస్కరణల ఎఫెక్ట్!
టీచర్ల నియామకం (Teachers Issue) లేకుండా ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.
- By CS Rao Published Date - 03:40 PM, Thu - 29 December 22

సమీప భవిష్యత్ లో టీచర్ల నియామకం (Teachers Issue) లేకుండా ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఆ విషయాన్ని పరోక్షంగా హైకోర్టుకు తెలియచేసింది. పాఠశాలల (Schools) హేతుబద్దీకరణ, విలీనం అంశంపై దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా సంచలన అంశాలను న్యాయస్థానం ముందుంచారు. రాబోవు రోజుల్లో టీచర్ల సంఖ్యను తగ్గించడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని పరోక్షంగా వాదనలను వినిపించింది. పాఠశాలల (Schools) సంఖ్యను తగ్గించే ప్రయత్నం చేస్తూ విద్యా సంస్కరణలు చేయడం ప్రభుత్వం ప్రధానోద్ధశంగా వెల్లడించారు.
Also Read : AP Employees: ఏపీ ఉద్యోగుల కోర్కెలకు జగన్ కళ్లెం!
రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి విద్యా సంస్కరణలను వేగంగా చేపట్టారు. ఆ సందర్భంగా 3, 5 తరగతులను అప్పర్ ప్రైమరీ కిందకు మార్చడంతో చాలా స్కూల్స్ మూతపడ్డాయి. వాటిలో పనిచేసే టీచర్లను ఇతర పాఠశాలలకు బదిలీ(Teachers Issue) చేయడం జరిగింది. ఇలా చేయడంపై పలు పిటిషన్లు హైకోర్టులో దాఖలు కావడం తెలిసిందే. వీటిపై వాదప్రతివాదనలు జరిగాయి.
టీచర్ల నియామకం (Teachers Issue) లేకుండా
పాఠశాలల హేతుబద్ధీకరణ, విలీనం రూపంలో రాష్ట్ర ప్రభుత్వం స్కూల్స్ ను పెద్ద సంఖ్యలో కుదించింది. ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ కారణంగా విలీనం జరిగిన పాఠశాలలకు బదిలీ జరిగింది. పాఠశాలలు, పాఠశాల విద్య ధ్వంసకర మార్గంలో సాగుతున్నందున సంస్కరణలు అవసరమయ్యాయని ప్రభుత్వం తరపున వాదన వినిపించింది. కొత్త విద్యావిధానాన్ని సవాల్ చేయడం విద్యార్థులకు నష్టమని ప్రభుత్వం భావిస్తోంది. పిల్లలందరికీ ఉచిత విద్య తో పాటు అన్ని రకాల సౌకర్యాలతో మెరుగైన వసతులు కల్పించేలా ప్రభుత్వం పనిచేస్తుందని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని తెలిపింది.
Also Read : Ap Employees : ఏపీ ఉద్యోగుల నోటి దురుసు! కూలీలు అంటే అంత అలుసా.!
ఎయిడెడ్ పాఠశాలలకు ఆర్థిక సహాయాన్ని ఏపీ ప్రభుత్వం నిలిపివేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఎయిడెడ్ పాఠశాల వ్యవస్థను నాశనం చేసిందని పిటిషనర్ల తరపున న్యాయవాది వాదనలను వినిపించారు. రాష్ట్ర ప్రభుత్వం
ఇప్పటికే కొత్త టీచర్ల రిక్రూట్‌మెంట్‌ను నిలిపివేసింది.హేతుబద్ధీకరణ, రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయుల సంఖ్యను మరింత తగ్గిస్తోందని ఆందోళన వ్యక్తపరిచారు. విద్యావ్యవస్థను దెబ్బతీస్తున్నారని వాదనలను బలంగా పిటిషనర్ల తరపున వినిపించారు. రాష్ట్రంలోని ప్రాథమిక స్థాయి నుంచి ప్రాథమికోన్నత పాఠశాలల్లో 3 నుంచి 5 తరగతులను విలీనం చేయడం ద్వారా ప్రభుత్వం అనేక పాఠశాలలను మూసివేస్తోంది. విద్యార్థులు ఎక్కువ దూరం ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. చదువుకోవడానికి కనీసం 3 కి.మీ మించి ఉండకూదని విద్యాహక్కు (RTE) చట్టం చెబుతోంది. దాన్ని ఉల్లంఘిస్తూ రాష్ట్ర ప్రభుత్వం విలీనం ప్రక్రియను కొనసాగించిందని కోర్టుకు పిటిషనర్లు తెలిపారు.
ప్రయివేటు పాఠశాలలకు పిల్లల్ని పంపడం
ఏపీ రాష్ట్రంలో పాఠశాలలు దగ్గర లేకపోవడంతో సుమారు 2 లక్షల మంది విద్యార్థులు బడి మానేశారు. నివాస స్థలం నుండి 3 కి.మీ. దూరంలో ఉండే ప్రైవేటు పాఠశాలల్లో చాలా మంది తల్లిదండ్రులు పిల్లలను చేర్పించారు. ప్రయివేటు పాఠశాలలకు పిల్లల్ని పంపడం ఆర్థిక భారంగా పరిణమించింది. జస్టిస్ యు దుర్గాప్రసాదరావు, జస్టిస్ టి మల్లిఖార్జునలతో కూడిన హైకోర్టు ధర్మాసనం వాదప్రతివాదనలను విన్న తరువా వాయిదా వేయడం జరిగింది.
Also Watch : జగన్ చాలా మొండి వాడు.. మమ్మల్ని మోసం చేశాడు- కొండా సురేఖ