Dokka Manikya Varaprasad : టీడీపీలోకి డొక్కా మాణిక్య వరప్రసాద్..?
తాడికొండ సీటు దక్కకపోవడంతో అసంతృప్తిగా ఉన్న MLC డొక్కా మాణిక్య వరప్రసాద్.. కొంతకాలంగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. త్వరలో ఆయన వైసీపీకి రాజీనామా చేసి, చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరేందుకు సిద్ధం అయ్యారనే వార్తలు వినిపిస్తున్నాయి
- Author : Sudheer
Date : 09-04-2024 - 5:49 IST
Published By : Hashtagu Telugu Desk
ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ అధికార పార్టీ వైసీపీ (YCP) కి షాకులు మరింత ఎక్కువుతున్నాయి. వరుస పెట్టి కీలక నేతలు పార్టీకి రాజీనామా చేస్తూ జగన్ (Jagan) కు షాక్ ఇస్తున్నారు. ఇప్పటికే పలువురు ఎంపీలు , ఎమ్మెల్యేలు కిందిస్థాయి నేతలు పార్టీకి గుడ్ బై చెప్పగా..తాజాగా మరో సీనియర్ నేత సైతం పార్టీని వీడేందుకు సిద్ధం అయ్యారని తెలుస్తుంది. తాడికొండ సీటు దక్కకపోవడంతో అసంతృప్తిగా ఉన్న MLC డొక్కా మాణిక్య వరప్రసాద్ (Dokka Manikya Varaprasad).. కొంతకాలంగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. త్వరలో ఆయన వైసీపీకి రాజీనామా చేసి, చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరేందుకు సిద్ధం అయ్యారనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే డొక్కా ప్రస్తుతం తటస్థంగా ఉన్నారని, ఏ పార్టీ వైపు చూడట్లేదని ఆయన అనుచరులు చెబుతున్నారు.
2004లో కాంగ్రెస్ తరపున గుంటూరు జిల్లాలో రిజర్వుడు నియోజక వర్గమైన తాడికొండలో డొక్కా విజయం సాధించారు. అప్పుడు వైఎస్ క్యాబినెట్‌లో చోటు కూడా దక్కించుకున్నారు. 2009లో రెండోసారి ఎన్నికైన తర్వాత కూాడా ఆయన మంత్రి పదవిలో కొనసాగారు. రాష్ట్ర విభజన తర్వాత కొన్నాళ్లు స్తబ్దుగా ఉన్నా.. కొద్ది రోజులకే టీడీపీ టీడీపీ గూటికి చేరారు. డొక్కా రాజకీయ గురువైన రాయపాటి ఆశీస్సులు ఉండటంతో టీడీపీలో చేరడం సులువైంది. టీడీపీలో చేరిన తర్వాత డొక్కా మాణిక్య వరప్రసాద్‌కు ఎమ్మెల్సీ పదవిని కూడా కట్టబెట్టారు.
We’re now on WhatsApp. Click to Join.
2014-19 మధ్య కాలంలో వైసీపీ మీద రాజకీయ దాడి చేయడంలో దళిత నేతలైన డొక్కా మాణిక్యవరప్రసాద్, జూపూడి జూపూడి ప్రభాకర్‌లు దూకుడుగా వ్యవహరించేవారు. 2019 ఎన్నికల్లో జగన్ గెలిచే అవకాశాలు ఏ మాత్రం లేవని, టీడీపీ రెండోసారి అధికారంలోకి వస్తుందని డొక్కా సవాళ్లు చేస్తూ వచ్చారు. కానీ 2019 వైసీపీ అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే జూపూడి టీడీపీని వీడి వైసీపీలో చేరారు. ఆ తర్వాత కాలంలో ఆయనకు ప్రభుత్వ సలహాదారుగా నియమించారు. సామాజిక సమీకరణల నేపథ్యంలో డొక్కా మాణిక్య వరప్రసాద్ కూడా రాజకీయ అస్తిత్వాన్ని వెదుక్కునే క్రమంలో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి వైసీపీలో చేరారు. వైసీపీలో ఆయనకు ఎమ్మెల్సీ పదవి దక్కింది. వైసీపీ తరపు తాడికొండలో గెలిచిన ఉండవల్లి శ్రీదేవి స్థానంలో తనకు అవకాశం దక్కుతుందని డొక్కా భావించారు. తాడికొండ అభ్యర్ధిగా మాజీ హోంమంత్రి మేకతోటి సుచరితకు అవకాశం దక్కింది. ఈ క్రమంలో రాజకీయంగా తనకు భవిష్యత్తు ఉండదనే ఆందోళన డొక్కాలో నెలకొంది. దీంతో గత కొద్దీ రోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. ఇక ఇప్పుడు టీడిపి లో చేరేందుకు సిద్ధం అయ్యారని తెలుస్తుంది.
Read Also : Lok Sabha 2024: వరంగల్ టికెట్ ఉద్యమ నేతకే.. కేసీఆర్ తంటాలు