HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Development Of Gandi Kota Rs Allocation Of 77 91 Crore Funds

Gandi Kota Development: ఏపీకి మ‌రో గుడ్ న్యూస్‌.. గండికోట అభివృద్ధికి రూ. 77.91 కోట్ల నిధులు కేటాయింపు!

చరిత్రాత్మక గండికోట వైభవాన్ని పునరుద్ధరిస్తూ ఆ కోటను పర్యాటకంగా అభివృద్ధి చేయాలనే దృక్పథంతో గ్రామీణ అభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తీసుకున్న చొరవ ఫలించింది.

  • Author : Gopichand Date : 28-11-2024 - 7:57 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Gandi Kota Development
Gandi Kota Development

Gandi Kota Development: ఏపీకి కేంద్ర ప్ర‌భుత్వం మ‌రో గుడ్ న్యూస్ చెప్పింది. ఏపీలోని గండికోట‌ను అభివృద్ధి చేసేందుకు నిధులు మంజూరు చేసింది. రూ. 77.91 కోట్ల నిధుల‌ను కేంద్రం ప్ర‌భుత్వం ఏపీకి కేటాయించింది. అమెరికాలోని గ్రాండ్ క్యానియన్ తరహాలో గండికోటను అభివృద్ధి చేసేందుకు ఏపీ ప్ర‌భుత్వం ప్ర‌ణాళిక‌లు రూపొందిస్తుంది. అమెరికాలోని గ్రాండ్ క్యానియన్ తరహాలో గండికోటను అభివృద్ధి (Gandi Kota Development) చేసే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం కూడా సహకరిస్తుందని గ్రామీణ అభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ఢిల్లీలోని సమాచార భవన్‌లో విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. గండికోట అభివృద్ధికి రూ. 77.91 కోట్ల నిధులను కేటాయించినందుకు కేంద్ర మంత్రిత్వ శాఖకు ఆయ‌న ధన్యవాదాలు తెలియజేశారు.

వివరాల్లోకి వెళితే.. చరిత్రాత్మక గండికోట వైభవాన్ని పునరుద్ధరిస్తూ ఆ కోటను పర్యాటకంగా అభివృద్ధి చేయాలనే దృక్పథంతో గ్రామీణ అభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తీసుకున్న చొరవ ఫలించింది. పెమ్మసాని ప్రయత్నానికి స్పందిస్తూ గండికోటను పర్యాటకంగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం రూ. 77.91 కోట్లను గురువారం మంజూరు చేసింది. గండికోట ప్రాభవం, ప్రాశస్త్యం భవిష్యత్ తరాలకు కూడా తెలియజేసేలా అభివృద్ధి చేయించేందుకు పెమ్మసాని నడుం బిగించారు. అందుకు గాను నిధులను మంజూరు చేయాలని కోరుతూ కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖకు పెమ్మసాని గడిచిన నవంబర్ 4న లేఖ రాశారు. అనంతరం కేంద్ర మంత్రిత్వ శాఖతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూ నిధుల మంజూరుకు కృషి చేశారు.

Also Read: Khelo India Youth Games: హైదరాబాద్ వేదిక‌గా ఖేలో ఇండియా గేమ్స్‌.. 2026లో నిర్వహించేందుకు కేంద్రం గ్రీన్ సిగ్న‌ల్‌!

ఈ క్రమంలో స్పందించిన కేంద్ర మంత్రిత్వ శాఖ రాష్ట్రంలో పలు ప్రాంతాలను పర్యాటకంగా అభివృద్ధి చేయాలని తీసుకున్న నిర్ణయాలలో గండికోటకు కూడా ప్రముఖ స్థానం కల్పించింది. అందులో భాగంగా గండికోట అభివృద్ధితో పాటు పరిసర నదీ పరివాహక ప్రాంతాన్ని కూడా పర్యాటకంగా అందుబాటులోకి తెచ్చేందుకు గాను నిధులను కేటాయించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ స్పందనకు పెమ్మసాని కృతజ్ఞతలు తెలియజేశారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Andhrapradesh
  • Chandra Sekhar Pemmasani
  • Gandikota
  • Gandikota Development
  • nda govt
  • politics
  • Union Minister Pemmasani

Related News

ArcelorMittal Nippon Steel India secures land in Andhra Pradesh

ముహుర్తం ఖరారు.. మార్చి 23న అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కు శంకుస్థాపన..!

Arcelormittal Nippon Steel Plant Bhoomi Pooja In Anakapalli  ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగం రూపురేఖలు మారబోతున్నాయి. అనకాపల్లి జిల్లా నక్కపల్లి సమీపంలో ఆర్సెలార్ మిట్టల్, నిప్పన్ సంస్థలు సంయుక్తంగా నిర్మించనున్న మెగా స్టీల్‌ ప్లాంట్‌కు మార్చి 23న శంకుస్థాపన జరగనుంది. దాదాపు 60,000 కోట్ల భారీ పెట్టుబడి పెట్టున్నారు. ఈ పరిశ్రమ ఉత్తరాంధ్ర ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చేయనుంది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం

  • Nellore Gets India’s First Autonomous Maritime Shipyard

    Nara Lokesh: నెల్లూరులో అటానమస్ మారిటైం షిప్ యార్డు.. ప్రపంచంలోనే మొదటిది.!

  • CM Chandrababu Naidu

    చంద్రబాబు మార్క్ పాలన.. మంత్రులకు సీఎం రేటింగ్స్.. అచ్చెన్నాయుడు ఫస్ట్, అనిత లాస్ట్!

  • Chandrababu Naidu

    కడపల్లెలో కుటుంబ సాధికార సారథిగా సీఎం చంద్రబాబు

  • Jagan

    వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు చెంప దెబ్బ‌!

Latest News

  • Grijp 20 Gratis Kansen om de Magie van spin maya te Ontketenen

  • Kerosene : మళ్లీ కిరోసిన్ సరఫరా!

  • Rain : వందల ఏళ్లుగా అక్కడ వర్షం పడడం లేదట !!

  • Kumari Aunty : బిజినెస్ లేదంటూ కుమారీ ఆంటీ ఆవేదన

  • Rashmika : తెలంగాణ కొత్త కోడలు కు కోపం వచ్చిందే !!

Trending News

    • Work From Home: మళ్లీ మొదలైన వర్క్ ఫ్రం హోమ్..ఈసారి ఎందుకంటే !!

    • పెళ్లి చేసుకున్న కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా

    • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

    • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

    • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd