Devaragattu : కర్రల సమరంలో 50మంది గాయాలు..బాలుడు మృతి..!!
ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లాలో దేవరగట్టులో ప్రతిఏటా నిర్వహించే కర్రల సమరంలో వేలాది మంది పాల్గొంటారు.
- Author : hashtagu
Date : 06-10-2022 - 6:57 IST
Published By : Hashtagu Telugu Desk
ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లాలో దేవరగట్టులో ప్రతిఏటా నిర్వహించే కర్రల సమరంలో వేలాది మంది పాల్గొంటారు. ఈ ఏడాది కూడా ఘనంగా నిర్వహించార. అయితే ఈ కర్రల సమరంలో 50మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. దసరా రోజున శ్రీ మాళమల్లేశ్వర స్వామికి నిర్వహించే వేడుకల్లో భాగంగా జరిగే ఈ కర్రల సమరం…ఈ ఏడాది వర్షం కారణంగా ఆలస్యంగా ప్రారంభం అయ్యింది. అయితే ఈ సమరంలో 50మందికి గాయాలయ్యాయి.
కర్రల సమరానికి వెళ్తుండగా ఓ బాలుడు మరణించాడు. అస్వస్థతకు గురైన మరణించిన బాలుడిని రవీంద్రనాథ్ రెడ్డి గుర్తించారు. గుండెపోటుతో మరణించినట్లు పోలీసులు తెలిపారు. బాలుడి స్వస్థలం కర్నాటకలో శిరుగుప్పగా గుర్తించారు. జిల్లాలోని దేవరగట్టులో మాళ మల్లేశ్వరస్వామి దసరా బన్ని జైత్రయాత్రకు చాలా ప్రాముఖ్యత ఉంది. దేవరగట్టులో సుమారు 800 అడుగుల ఎత్తైన కొండపై మాల మల్లేశ్వర స్వామి ఆలయం ఉంది. దసరా బన్నీ ఉత్సవం సందర్భంగా స్వామిని దక్కించుకోవడానికి నెరణికి, నెరణికి తండా, కొత్తపేట గ్రామాల భక్తులు ఓవైపు, అరికెర, అరికెర తండా, సుళువాయి, ఎల్లార్తి, కురుకుంద, బిలేహాల్, విరుపాపురం తదితర గ్రామాల భక్తులు మరోవైపు కర్రలతో తలపడతారు. ఈ వేడుకకు ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలివస్తారు. భారీగా పోలీసులు మోహరిస్తారు.