HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Deputy Cm Pawan Kalyan Meet Union Minister Amit

Delhi : కేంద్ర మంత్రి అమిత్‌తో డిప్యూటీ సీఎం పవన్​ కల్యాణ్ భేటి

Delhi : ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఇప్పటివరకు తాను ఢిల్లీ పెద్దలను కలవలేదని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో మర్యాదపూర్వకంగానే సమావేశమవుతున్నామని పవన్ వెల్లడించారు.

  • Author : Latha Suma Date : 06-11-2024 - 7:29 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Deputy CM Pawan Kalyan meet Union Minister Amit
Deputy CM Pawan Kalyan meet Union Minister Amit

Deputy CM Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షాతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మొదటి పవన్‌ కళ్యాణ్‌ అమిత్‌షాతో సమావేశమయ్యారు. సహకార శాఖ నుంచి నిధుల కేటాయింపుపై అమిత్‌ షాతో పవన్‌ చర్చించనున్నట్లు తెలుస్తోంది. అలాగే రాష్ట్రానికి రావాల్సిన నిధుల అంశం ఇరువురి మధ్య చర్చకు వచ్చినట్లు సమాచారం.

కాగా, తొలిసారి ఏపీ డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. పవన్ కళ్యాణ్ పర్యటన పై ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో అమిత్‌షాతో భేటికి ముందు మీడియాతో పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఇప్పటివరకు తాను ఢిల్లీ పెద్దలను కలవలేదని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో మర్యాదపూర్వకంగానే సమావేశమవుతున్నామని పవన్ వెల్లడించారు. ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి మరింత బాధ్యతగా ఉంటామన్నారు. అప్పుడైనా ఇప్పుడైనా బాధ్యతతోనే పర్యటనలు చేస్తున్నామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

ఇకపోతే.. వైఎస్‌ జగన్‌ కుటుంబానికి చెందిన సరస్వతి పవర్ భూములను ఇటీవల పవన్ కల్యాణ్ స్వయంగా పరిశీలించారు. పల్నాడు జిల్లా మాచవరం, దాచేపల్లి మండలాల్లో సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ పేరిట భూములు ఉన్నాయి. మరో వైపు రాష్ట్రంలో పోలీసు శాఖ సరిగా పని చేయట్లేదని పవన్ ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్​ షాతో ఏయే అంశాలు పవన్ కల్యాణ్​ మాట్లాడారో తెలియాల్సి ఉంది. వెలగపూడిలో మంత్రి వర్గ సమావేశం అనంతరం పవన్‌ కల్యాణ్‌ ఢిల్లీకి బయల్దేరి వచ్చారు.

Read Also: Bitcoin : ట్రాంప్ విజయం తో బిట్‌కాయిన్ సరికొత్త రికార్డు


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Allocation funds
  • Cooperative Department
  • delhi
  • Deputy CM Pawan Kalyan
  • Jana Sena
  • Union Home Minister Amit Shah

Related News

Meeting Of CMs

India AI Impact Summit 2026 : ఏఐ సమ్మిట్ కు తెలుగు రాష్ట్రాల సీఎంలు

ఈ సదస్సు ద్వారా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ తమ రాష్ట్రాల్లో ఉన్న అనుకూలతలు, వనరులు మరియు రాయితీలను పారిశ్రామికవేత్తల ముందు ఉంచుతున్నారు

  • Bill Gates 

    ఏఐ సదస్సుకు బిల్‌గేట్స్‌ దూరం..

  • Lakhpati Bitiya Yojana

    లఖ్‌పతి బిటియా యోజన 2026.. కుమార్తెల చదువు కోసం సరికొత్త పథకం!!

Latest News

  • Balakrishna Lays Foundation Stone For Own House : బాలకృష్ణ మకాం మారబోతుందా ?

  • AI Impact Summit : ఇండియా AI సమిట్‌లో చొక్కాలు విప్పి నిరసన

  • 17వ అంతస్తు పై నుంచి కిందపడి మిలియనీర్ అనుమానాస్పద మృతి

  • బ్రతికుండగానే సమాధి కట్టుకున్న వృద్ధుడి ప్రేమగాథ

  • డంపింగ్ యార్డులో మదనపల్లె కులవర్ధన్ అంత్యక్రియలు.. కడసారి చూసేందుకు రాని కుటుంబ సభ్యులు

Trending News

    • మండలిలో కొత్త రచ్చ.. దేవుడి చిత్రాలతో వైసీపీ రాజకీయం

    • ఐటీ శాఖ టార్గెట్ లిస్ట్‌లో ప్ర‌ముఖులు!

    • టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో సంచ‌ల‌నం.. శ్రీలంక‌పై జింబాబ్వే ఘ‌న‌విజ‌యం!

    • టీ20 వరల్డ్ కప్ 2028కు 12 జట్లు క్వాలిఫై.. లిస్ట్ ఇదే!

    • టీ20 క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd