Kadiyam YCP Office : కడియంలో వైసీపీ ఆఫీస్ కూల్చివేత
అధికారం తమ చేతుల్లో ఉంది..అడిగే వారు ఎవరు లేరు..వచ్చేది కూడా మన ప్రభుత్వమే అనే ధీమా తో జగన్..ప్రభుత్వ స్థలాల్లో తన పార్టీ ఆఫీసులను కట్టడం చేసాడు
- By Sudheer Published Date - 06:31 PM, Sat - 29 June 24

ఏపీలో అధికారంలోకి వచ్చిన కూటమి సర్కార్..వైసీపీ అధినేత ,మాజీ సీఎం జగన్ కు వరుస షాకులు ఇస్తుంది. ఎన్నికల్లో భారీ ఓటమి నుండి కోలుకోకముందే..వైసీపీ పార్టీ ఆఫీసుల కూల్చి వేత పనులు మొదలుపెట్టి దెబ్బ మీద దెబ్బ కొడుతుంది. అధికారం తమ చేతుల్లో ఉంది..అడిగే వారు ఎవరు లేరు..వచ్చేది కూడా మన ప్రభుత్వమే అనే ధీమా తో జగన్..ప్రభుత్వ స్థలాల్లో తన పార్టీ ఆఫీసులను కట్టడం చేసాడు. కానీ అధికారంలోకి వచ్చిన చంద్రబాబు…జగన్ తో పాటు ఆ పార్టీ నేతల ఫై డేగ కన్నేశారు. ఐదేళ్లలో వీరు చేసిన అక్రమాలను బయటకు తీసుకరావాలని కంకణం కట్టుకున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
ముందుగా అక్రమంగా కట్టిన పార్టీ ఆఫీసులకు నోటీసులు ఇవ్వడం ,కూల్చడం మొదలుపెట్టారు. ఇప్పటికే అనేక చోట్ల కూల్చివేతలు చేయగా..తాజాగా తూర్పుగోదావరి జిల్లా కడియంలో ప్రభుత్వ స్థలంలో పర్మిషన్ లేకుండా కట్టిన వైసీపీ కార్యాలయాన్ని గ్రామ పంచాయతీ అధికారులు దాన్ని కూల్చివేశారు. అయితే రైతు బజార్ కోసం షెడ్డు నిర్మాంచామని వైసీపీ నేత గిరిజాల బాబు వాదించారు. దీంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. కడియ పోలీస్ స్టేషన్ ఎదుట గిరిజాలబాబు అనుచరులు ఆందోళన చేస్తున్నారు.
Read Also : Jai Bolo Telangana Heroine : పెళ్లి చేసుకున్న ‘జై బోలో తెలంగాణ’ హీరోయిన్