Jai Bolo Telangana Heroine : పెళ్లి చేసుకున్న ‘జై బోలో తెలంగాణ’ హీరోయిన్
మీరా నందన్.. ఈపేరు జనాలకు అంతగా తెలియకపోవచ్చు. కానీ ఒకప్పుడు తెలుగు థియేటర్లలో సంచలనం సృష్టించిన జై బోలో తెలంగాణ మూవీ హీరోయిన్ అంటే మాత్రం ఠక్కున గుర్తుపట్టేస్తారు
- Author : Sudheer
Date : 29-06-2024 - 6:02 IST
Published By : Hashtagu Telugu Desk
‘జై బోలో తెలంగాణ’ (Jai Bolo Telangana ) ఫేమ్ మీరా నందన్ (Meera Nandan) పెళ్లి చేసుకుంది. ఇటీవల వరుసగా సినీ స్టార్స్ పెళ్లి పీటలు ఎక్కుతూ బ్యాచ్లర్ లైఫ్ కు గుడ్ బై చెపుతున్నారు. వరుస ఛాన్సులతో ఫుల్ స్వింగ్ లో ఉన్న హీరోయిన్లతో పాటు ఛాన్సులు లేని భామలు సైతం పెళ్లి పీటలు ఎక్కి ఓ ఇంటివారు అవుతున్నారు. తాజాగా ‘జై బోలో తెలంగాణ’ ఫేమ్ మీరా నందన్ సైతం పెళ్లి చేసుకొని ఓ ఇంటింది అయ్యింది. ఎలాంటి హడావిడి లేకుండా గుడిలో సింపుల గా వివాహం చేసుకుంది. శనివారం ఉదయం గురువాయూర్ ఆలయంలో లండన్‌లో అకౌంటెంట్‌గా పనిచేస్తున్న శ్రీజుతో మీరా నందన్ ఏడడుగులు వేసింది. వీరి వివాహ వేడుకకు సంబంధించిన ఫోటోస్ నెట్టింట వైరల్ గా మారాయి. అంతకు ముందు జరిగిన హల్దీ, మెహందీ, సంగీత్ వేడుకలలో పలువురు సినీ ప్రముఖులు సందడి చేశారు. గతేడాది సెప్టెంబర్ 13న వీరిద్దరి నిశ్చితార్థం జరిగింది. మీరా, శ్రీజు ఇద్దరు ప్రముఖ మ్యాట్రిమోని ద్వారా కలుసుకున్నారని సమాచారం.
We’re now on WhatsApp. Click to Join.
ఇక మీరా నందన్.. ఈపేరు జనాలకు అంతగా తెలియకపోవచ్చు. కానీ ఒకప్పుడు తెలుగు థియేటర్లలో సంచలనం సృష్టించిన జై బోలో తెలంగాణ మూవీ హీరోయిన్ అంటే మాత్రం ఠక్కున గుర్తుపట్టేస్తారు. 2011లో విడుదలైన ఈ సినిమా అప్పట్లో భారీ విజయాన్ని అందుకుంది. ఈమూవీలో జగపతి బాబు, స్మృతి ఇరానీ, సందీప్ సింగ్ ప్రధాన పాత్రలు పోషించగా.. మీరా నందన్ హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ తర్వాత తెలుగులో మరో సినిమా చేయలేదు. 1990 నవంబర్ 26న కేరళలోని కొచ్చి ప్రాంతంలో జన్మించిన మీరా నందన్ జర్నలిజం పూర్తి చేసి మొదట్లో ప్రకటనలు చేసింది. ఆ తర్వాత స్టార్ సింగర్ రియాల్టీ షోకు యాంకరింగ్ చేసింది. 2007లో ముల్లా సినిమాతో సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత తమిళం, కన్నడ, తెలుగు భాషలలో పలు సినిమాల్లో నటించింది. ఇందులో జై బోలో తెలంగాణ సినిమా ఆమెకు గుర్తింపు తెచ్చిపెట్టింది.
Read Also : Maharashtra: కాలికి గాయమైతే సున్తీ చేసి పంపించారు