HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Date Fixed For The Release Of Thalliki Vandanam Funds

Thalliki Vandanam: తల్లికి వందనం నిధుల విడుదలకు ముహూర్తం ఫిక్స్

  • Author : Vamsi Chowdary Korata Date : 02-07-2026 - 10:22 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Date fixed for the release of 'Thalliki Vandanam' funds.
Date fixed for the release of 'Thalliki Vandanam' funds.

‘తల్లికి వందనం’ పథకం రెండో విడత నిధులను జూలై 16 నుంచి 18వ తేదీల మధ్య తల్లుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా మెగా పేరెంట్-టీచర్ మీటింగ్‌లు (పీటీఎం) నిర్వహించే సమయంలోనే ఈ నిధులను విడుదల చేయనున్నట్లు ఆయన స్పష్టం చేశారు.

రేణిగుంట మండలంలో శ్రీకాళహస్తి నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో లోకేష్ మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 150 రోజుల వ్యవధిలోనే 16,000 ఉపాధ్యాయ, 6,000 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టిందని తెలిపారు. ఈ ఏడాది మరో 10,000 పోస్టులతో మెగా జాబ్ క్యాలెండర్ విడుదల చేయనున్నట్లు వివరించారు. ప్రభుత్వ విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు జూలై 15 నుంచి ‘ఇంటింటి ప్రచారం’ చేపట్టాలని పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. అదేవిధంగా, ప్రతిపక్ష పార్టీల వైఖరిని ప్రస్తావిస్తూ.. కార్యకర్తలు చెడు లక్షణాలను అలవర్చుకోవద్దని సూచించారు.

ఈ పర్యటనలో భాగంగా లోకేష్ పలు ప్రభుత్వ పాఠశాలలను సందర్శించి తనిఖీ చేశారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను అభినందించడంతో పాటు, పలువురు లబ్ధిదారులకు ఇళ్ల స్థలాల పట్టాలను పంపిణీ చేశారు. అనంతరం ఆయన శ్రీకాళహస్తీశ్వర ఆలయాన్ని సందర్శించి, స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Andhra Pradesh CM Chandrababu Naidu
  • andhra pradesh government
  • Education Minister Nara Lokesh
  • Thalliki Vandanam
  • Thalliki Vandanam News

Related News

AP EAPCET results released

AP EAPCET Results: ఏపీ ఎప్‌సెట్‌ ఫలితాల విడుదల

ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎప్పుడెప్పుడా అని ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఏపీ ఎప్‌సెట్ (AP EAPCET 2026) ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ ఎక్స్ వేదికగా ఫలితాలను విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంజినీరింగ్ విభాగంలో మొత్తం 2,76,572 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా… వారిలో 2,58,545 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 1,82,317 మంది (70.52 శాతం) విద్యా

  • AP EAPCET 2026 results postponed again.

    AP EAPCET Results: ఏపీ ఎప్‌సెట్‌ 2026 ఫలితాలు మళ్లీ వాయిదా

  • 'Made in Jonnagiri' gold enters the market.

    Jonnagiri Gold Mine: మార్కెట్లోకి ‘మేడిన్ జొన్నగిరి’ బంగారం

  • Massive influx of students from private schools to government schools in AP.

    Nara Lokesh: ఏపీ ప్రైవేట్ స్కూళ్ల నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో భారీగా విద్యార్థుల చేరిక

  • AP government gives key posting to IAS officer Srilakshmi.

    IAS Srilakshmi: ఐఏఎస్ శ్రీలక్ష్మీకి ఏపీ ప్రభుత్వం కీలక పోస్టింగ్..

Latest News

  • Donald Trump: పనామా కాలువ విషయంలో చైనాను హెచ్చరించిన ట్రంప్: దీనిని మేము అనుమతించము.

  • Harish Rao: తెలంగాణభవన్‌ వద్ద హైడ్రామా.. పోలీసుల అదుపులో మాజీ మంత్రి హరీష్‌ రావు

  • CM Revanth Reddy: రైతులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్

  • Gold Rates: బంగారం ధరలు ప్రస్తుతం ఎలా ఉన్నాయంటే

  • Chicken Prices: నాన్-వెజ్ ప్రియులకు బ్యాడ్ న్యూస్.. భారీగా పెరిగిన చికెన్, గుడ్ల ధరలు.. ఎంతంటే..?

Trending News

    • ఇరాక్‌లో భారీ అవినీతి తిమింగలం! ఆ ఎంపీ ఇంట్లో బంగారు లోదుస్తులు లభ్యం..

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd