Chandrababu: చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమంపై సిఎస్ సమీక్ష
- By Balu J Published Date - 10:38 PM, Sat - 8 June 24

Chandrababu: ఈనెల 12న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్.చంద్రబాబు నాయుడు గన్నవరం విమానాశ్రయం సమీపంలో ఏర్పాటు చేస్తున్న సభలో ప్రమాణ స్వీకారం చేయనున్న నేపధ్యంలో శనివారం విజయవాడ సిఎస్ క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. ఈసమావేశంలో సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ మాట్లాడుతూ ఈప్రమాణ స్వీకారానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడి,రాష్ట్ర గవర్నర్ సహా పలువురు ఇతర ప్రముఖులు హాజరు కానున్నారని కావున కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. అలాగే విస్తృత మైన బందోబస్తు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
గన్నవరం విమానాశ్రయంలో వివిఐపిలు,విఐపిలు తదితర ప్రముఖుల విమానాలు, హెలికాప్టర్లకు తగిన పార్కింగ్ కు తగిన ఏర్పాట్లు చేయాలని ఎయిర్ అధికారులను సిఎస్ ఆదేశించారు.అలాగే ప్రమాణ స్వీకారానికి హాజరయ్యే కేంద, రాష్ట్రాలకు చెందిన ప్రజా ప్రతినిధులు,తదితర వాహనాల పార్కింగ్ కు తగు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఇంకా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సంబంధించిన ఇతర అంశాలపై సిఎస్ నీరసించి కుమార్ ప్రసాద్ సమీక్షించారు. డిజిపి హరీశ్ కుమార్ గుప్త మాట్లాడుతూ విస్తృతమైన బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు.అదే విధంగా ఈకార్యక్రమానికి హాజరయ్యే వారి వాహనాల పార్కింగ్ కు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు.