Ration Card Holders : నేటి నుండి ఏపీ రేషన్ షాప్ లో తక్కువ ధరకే ఆయిల్ పంపిణి
రాష్ట్రంలోని అన్ని దుకాణాల్లో శుక్రవారం నుండి నెలాఖరు వరకూ పామోలిన్ లీటర్ రూ110లు, సన్ ఫ్లవర్ ఆయిల్ లీటరు రూ.124 చొప్పున విక్రయించనున్నట్లు మంత్రి మనోహర్ తెలిపారు
- Author : Sudheer
Date : 11-10-2024 - 10:16 IST
Published By : Hashtagu Telugu Desk
కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన దగ్గరి నుండి ప్రజలకు వరుస శుభవార్తలు అందజేస్తుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తూనే మరోపక్క రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. ఇదే తరుణంలో రేషన్ కార్డు దారులకు తక్కువ ధరల్లో నిత్యావసరాలు (Necessities) అందజేస్తూ వారి దీవెనలు అందుకుంటుంది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా నిత్యావసర ధరలు ఏ మేరకు పెరిగాయో తెలియంది కాదు..భారీ వర్షాల వల్ల కూరగాయల ధరలు ఆకాశానికి తాకగా..మరోపక్క టాక్స్ ల పేరుతో మార్కెట్ లో లభించే అన్ని వస్తువుల ధరలు భారీగా పెరిగాయి. ఇక ఇటీవల ఆయిల్ (cooking oils ) ధరలు కూడా పెరగడం తో సామాన్య ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. పండగవేళ ఎంత ధరలు పెరిగితే పండగ ఎలా జరుపుకోవాలి..? అంటూ మాట్లాడుకుంటున్నారు.
ఈ తరుణంలో ఏపీ సర్కార్ (AP Govt) రేషన్ కార్డు దారులకు (Ration Card Holders) తక్కువ ధరలకే వంటనూనెలు అందిస్తుంది. రాష్ట్రంలోని అన్ని దుకాణాల్లో శుక్రవారం నుండి నెలాఖరు వరకూ పామోలిన్ లీటర్ రూ110లు, సన్ ఫ్లవర్ ఆయిల్ లీటరు రూ.124 చొప్పున విక్రయించనున్నట్లు మంత్రి మనోహర్ తెలిపారు. ఒక్కో రేషన్ కార్డుపై మూడు లీటర్ల పామోలిన్, ఒక లీటర్ సన్ ఫ్లవర్ ఆయిల్ చొప్పున నిర్ణయించిన ధరలపై అందించనున్నట్లు ఆయన వెల్లడించారు.
ఇండోనేసియా, మలేషియా, ఉక్రెయిన్ నుంచి దిగుమతులు తగ్గడంతో పాటు పన్నులు, ప్యాకేజీ ఖర్చులు పెరగడంతో ధరలు పెరిగాయని వ్యాపారులు చెప్పుకొస్తున్నారు.
Read Also : Vettaiyan Collections : ‘వేట్టయాన్’ డే 1 కలెక్షన్లు