AP Govt : ఏపీ కూటమి ప్రభుత్వానికి సీఎం రేవంత్ రెడ్డి సవాల్
AP Govt : బీజేపీ, ఎన్డీఏ పాలిత రాష్ట్రాల్లో బీసీ ఉపకులాల జాబితాలో ముస్లిం మైనార్టీలు ఉన్నాయని, APలో NDA ప్రభుత్వమే అధికారంలో ఉంది కదా?
- By Sudheer Published Date - 08:31 PM, Fri - 28 February 25

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వాన్ని(AP NDA Government) ప్రశ్నిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ, ఎన్డీఏ పాలిత రాష్ట్రాల్లో బీసీ ఉపకులాల జాబితాలో ముస్లిం మైనార్టీలు ఉన్నాయని, APలో NDA ప్రభుత్వమే అధికారంలో ఉంది కదా? అక్కడ బీసీ మైనార్టీలకు ఇస్తున్న రిజర్వేషన్లు రద్దు చేసే దమ్ము కేంద్రానికి ఉందా కిషన్ రెడ్డి? భావోద్వేగాలను రెచ్చగొట్టి, రాజకీయ ప్రయోజనాలు పొందాలని చూస్తున్నారా? ఏపీలో SC వర్గీకరణ ఎందుకు చేయడం లేదు? మాదిగలకు ద్రోహం చేయడం లేదా?’ అని సీఎం రేవంత్ ప్రశ్నించారు.
Fire Accident : పుప్పాలగూడలో ఘోర అగ్ని ప్రమాదం
ఇక కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బెదిరింపులకు భయపడమని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణకు కేంద్రం అసంతృప్తికరమైన వైఖరి తీసుకుంటోందని, మెట్రో, మూసీ ప్రాజెక్టులు కిషన్ రెడ్డి వల్లే ఆగిపోయాయని ఆరోపించారు. ప్రధాని మోదీ ప్రభుత్వం ఎన్నికలకు ముందు హామీలను అమలు చేయడంలో విఫలమైందని, కేంద్రం ఇప్పటి వరకు ఎన్ని ఉద్యోగాలు కల్పించిందో, రాష్ట్రానికి ఎన్ని ఇళ్లు మంజూరు చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. అధికారం కోల్పోతారనే భయంతో కుల గణన ప్రక్రియను కేంద్రం అడ్డుకుంటోందని మండిపడ్డారు. తెలంగాణ ప్రజల నుంచి వసూలు చేసే పన్నుల్లో ఒక్క పావలా కూడా రాష్ట్రానికి తిరిగి అందడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Jos Buttler: ఇంగ్లండ్ వైట్ బాల్ క్రికెట్‌కు జోస్ బట్లర్ రాజీనామా!
తెలంగాణ రాష్ట్రాభివృద్ధికి తగిన ప్రాధాన్యం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అవసరమైన ప్రతీ సారి ఢిల్లీకి వెళ్లేందుకు వెనకడుగు వేయబోమని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. గతంలో పదేళ్ల బిఆర్ఎస్ పాలనలో వరంగల్ అభివృద్ధికి ఏమి చేశారు? అని ప్రశ్నించారు. వరంగల్‌కు ఎయిర్‌పోర్టు కావాలని కేంద్రాన్ని తానే అడిగానని, భూసేకరణ పూర్తయిన తర్వాతే ప్రాజెక్ట్ కదలికలోకి వచ్చిందని వెల్లడించారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ సాధించిన ఘనత తనదేనని పేర్కొన్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టుల కోసం కేంద్రాన్ని ఎన్నిసార్లైనా నిలదీయడం జరుగుతుందని, తెలంగాణకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.