CM Jagan : తిరుపతిలో శ్రీనివాససేతు ఫ్లైఓవర్‌ను ప్రారంభించిన సీఎం జగన్
తిరుపతిలో సీఎం జగన్‌మోహన్ రెడ్డి పర్యటిస్తున్నారు. తిరుపతిలో శ్రీనివాస సేతు ఎలివేటెడ్ ఎక్స్‌ప్రెస్‌వే కారిడార్‌ను
- By Prasad Published Date - 06:03 PM, Mon - 18 September 23

తిరుపతిలో సీఎం జగన్‌మోహన్ రెడ్డి పర్యటిస్తున్నారు. తిరుపతిలో శ్రీనివాస సేతు ఎలివేటెడ్ ఎక్స్‌ప్రెస్‌వే కారిడార్‌ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం ప్రారంభించారు. మొత్తం 684 కోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్టుకు టీటీడీ, తిరుపతి స్మార్ట్ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్ సంయుక్తంగా 67:33 సహకారంతో నిధులు సమకూర్చాయి. ఎలివేటెడ్ ఎక్స్‌ప్రెస్‌వే తిరుమలకు వెళ్లే భక్తుల ప్రయాణానికి ఇబ్బంది లేకుండా నగరంలోని వివిధ ప్రాంతాలను కలుపుతూ ఈ ఫ్లైఓవర్ రూపొందించబడింది. ఈ ప్రాజెక్ట్ స్థానికులకు దీర్ఘకాలంగా ఉన్న ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం చూపింది. ఫిబ్రవరి 17, 2018న నిర్మాణ పనులను ప్రారంభంకాగా.. ఫ్లైఓవర్ పూర్తి చేయడానికి రెండేళ్ల కాలపరిమితిని నిర్ణయించారు. అయితే డిజైన్ మార్పులు మరియు కోవిడ్-19 మహమ్మారి కారణంగా ప్రాజెక్ట్ ఆలస్యమైంది. ఇప్పటికి శ్రీనివాస సేతు ఎలివేటెడ్ ఎక్స్‌ప్రెస్‌వే మూడు దశలు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు.ఫ్లైఓవర్‌ను ప్రారంభించిన అనంతరం ఎస్‌వీ ఆర్ట్స్ కాలేజీ హాస్టల్ భవనాన్ని సీఎం జగన్ ప్రారంభించారు. టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమాన్ని కూడా సీఎం ప్రారంభించారు.